అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Illegal Charcoal Manufacturing |అక్రమంగా బొగ్గు తయారీపై అటవీశాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా నిజామాబాద్ అటవీ డివిజన్ (Nizamabad Forest Department) పరిధిలోని రెంజల్ (Renjal) మండలం నీలా గ్రామంలో లైసెన్స్ ఉన్న చార్కోల్ డిపోలో కలపను స్వాధీనం చేసుకున్నారు.
Illegal Charcoal Manufacturing | నిజామాబాద్ అటవీ డివిజన్ పరిధిలో..
బాసర సర్కిల్ అటవీ సంరక్షణాధికారి అర్పణ సయాల్ మార్గదర్శకత్వంలో, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ పాటిల్ పర్యవేక్షణలో అటవీ విభాగాధిపతి సుధాకర్‌రావు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4వ తేదీన రెంజల్ మండలంలోని చార్కోల్ డిపోపై దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా నిల్వ ఉంచిన వేప, మామిడి, తుమ్మ, ఇతర వృక్ష జాతులకు చెందిన సుమారు 170 చెట్లకు సమానమైన 85 సీఎంటీ (సుమారు 51 మెట్రిక్ టన్నులు) కలపను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత కలప, తయారవుతున్న బొగ్గు, ఇతర వస్తువులను చట్టప్రకారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి బోధన్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు అటవీశాఖాధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Stock Market Today | స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు