అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Inter Supplementary Exams | కట్టుదిట్టమైన సీసీకెమెరాల నిఘానీడలో (CCTV Surveillance Exams) ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయని డీఐఈవో రవికుమార్ (DIEO Ravikumar) అన్నారు. ఆదివారం నిజామాబాద్(Nizamabad) బాలుర( ఖిల్లా) జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు.
Inter Supplementary Exams | సీఎస్, డీవోలదే కీలకపాత్ర..
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ(Intermediate Exams) పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టమెంటల్ అధికారులదే కీలకపాత్ర అని పాత్ర అని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని డీఐఈవో పేర్కొన్నారు. జిల్లాలో 39 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి 19వరకు జరిగే పరీక్షల కోసం ఇంటర్ బోర్డు, కలెక్టర్ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. సీఎస్, డీవోలు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో వెంటనే సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రశ్నపత్రాల బండిళ్లను సైతం కెమెరాల ముందే ఓపెన్ చేయాలని ఆదేశించారు. అందరూ సమయ పాలన చేయాలని అన్నారు.
Inter Supplementary Exams | సెల్ఫోన్లకు అనుమతి లేదు..
పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు వెంటనే సమకూర్చాలని డీఐఈవో ఆదేశించారు. సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితిల్లో పరీక్ష కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని, సీఎస్, డీవోలు కూడా పరీక్ష జరుగుతున్న సమయంలో పోలీస్ కస్టడీలోనే సెల్ఫోన్లు ఉంచాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు ముందే ఇన్విజిలేటర్ల సమావేశం నిర్వహించి తగిన నియమ నిబంధనలు వివరించాలని ఆదేశించారు. ప్రతి రోజు ఫ్లయింగ్, సిట్టింగ్, ఇంటర్ బోర్డు స్క్వాడ్లతో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖి చేస్తారని అన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యాక ఐదు నిమిషాల వరకు విద్యార్థులను(Telangana Education) కేంద్రంలోకి అనుమతించవచ్చని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. పరీక్షల నిర్వహణకు ముందు, పరీక్ష జరుగుతున్న సమయంలో, పరీక్ష పూర్తయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలను పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నుస్రత్ జహాన్, రజియా సుల్తానా, ఖిల్లా బాలుర కళాశాల ప్రిన్సిపల్ ఖాలిక్, అధికారి చిన్నయ్య తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Modi Bengaluru Security| ప్రధాని మోదీ పర్యటన వేళ పేలుడు పదార్థాల కలకలం.. బెంగళూరులో హైఅలర్ట్

