Mental Health Services | గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సేవలను విస్తరించాలి

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సేవలను విస్తరించాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్​ కృష్ణ మోహన్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Mental Health Services | జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సేవలను విస్తరించాలని ప్రభుత్వ వైద్య కళాశాల(Medical College) ప్రిన్సిపాల్​ కృష్ణ మోహన్​ అన్నారు. వైద్య కళాశాల, జీజీహెచ్​ మానసిక వైద్య విభాగం (Nizamabad GGH) ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జీజీహెచ్​లో మంగళవారం నిర్వహించారు.

Mental Health Services |చురుకుగా పాల్గొనాలి..

కృష్ణమోహన్ మాట్లాడుతూ.. సైకియాట్రీ పీజీ విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాలు, మత్తు పదార్థాల నివారణ (డ్రగ్ డీ-అడిక్షన్) అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. గ్రామీణ ప్రజల్లో మానసిక వ్యాధులు, మత్తు పదార్థాల వ్యసనంపై ఉన్న అపోహలను తొలగించడం, ముందస్తు గుర్తింపు, చికిత్సకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన, సృజనాత్మకత, సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థుల కోసం పోస్టర్, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్​ సూపరింటెండెంట్ ఎల్. రాములు గౌరవ అతిథిగా హాజరై  విద్యార్థులు సేవలను అభినందించారు. కార్యక్రమాన్ని మానసిక వైద్య విభాగాధిపతి ప్రొఫెసర్ విశాల్ అకుల(Akula Vishal) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రదీప్, రమణ, అరుణ్ పాల్గొన్నారు.

ggh

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *