అక్షరటుడే, బోధన్: ARP Camp Alumni Reunion | 65 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఏఆర్పీ క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు (Alumni Reunion) ఒక్కచోట కలిశారు. ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ARP Camp Alumni Reunion | పండుగ వాతావరణంలో..
ఎడపల్లి (Yedapally) మండలంలోని ఏఆర్పీ క్యాంప్‌లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆద్యంతం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. 1959లో నిజాం చక్కెర పరిశ్రమ యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ పాఠశాల ఎయిడెడ్‌గా మారి, 2001లో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఎడపల్లితో పాటు బ్రాహ్మణపల్లి, వడ్డేపల్లి, కందకుర్తి వంటి 15కి పైగా చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు విద్యా నిలయంగా నిలిచింది. పూర్వ విద్యార్థులు రూ.7 లక్షల వ్యయంతో శిథిలావస్థకు చేరిన పాఠశాల పాత భవనాన్ని పునర్నిర్మించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ARP Camp Alumni Reunion | ఆనాటి ఉపాధ్యాయులకు ఘన సన్మానం
65 ఏళ్లలో తొలిసారిగా అన్ని బ్యాచ్‌ల విద్యార్థులు హాజరై బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం నాటి ఉపాధ్యాయులను, పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు తోట రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి రాజశేఖర్, రిటైర్డ్ జడ్జి హజార్ హుస్సేన్, రిటైర్డ్ జైల్ సూపరింటెండెంట్ జహీరా బేగం, రిటైర్డ్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ రావు, ఆనంద్ రావు, కొమురయ్య, సుశీల, జయ సాగర్, ఆమీర్ అమర్, రమేష్, అన్న గ్రేస్, రజిని, రమేష్, నరేందర్, స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఒకే వేదికపై.. బండి సంజయ్ – కౌశిక్ రెడ్డి