అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Bhagirath Case | బండి భగీరథ్ (Bandi Bhagirath) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేసిన వారి గురించి దర్యాప్తు చేసేందుకు జాయింట్ సీపీ శ్వేత ఆధ్వర్యంలో అధికారులు సిట్ ఏర్పాటు చేశారు.
Bandi Bhagirath Case | సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు
బండి భగీరథ్‌పై పోక్సో కేసు (POCSO Case) తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదట పరారీలో ఉన్న భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. అయితే హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో కొంతమంది సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశారు. నిందితుడికి బెయిల్ ఇస్తే జడ్జి మాధవి భర్తకు బార్ కౌన్సిల్ ఛైర్మన్ పదవి ఇస్తారని పోస్టులు చేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు రిజిస్ట్రార్ చార్మినార్ పోలీసు (Charminar Police)లకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులను గుర్తించేందుకు సిట్ ఏర్పాటు చేశారు.
Bandi Bhagirath Case | జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు
కాగా ఈ కేసులో న్యాయమూర్తిపై తప్పుడు వార్తలు ప్రచారం చేసిన నెల్లూరుకు చెందిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్టులతో కేసుల పాలు ఇటీవల కొందరు సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఏది పడితే అది పోస్టు చేస్తున్నారు. బండి భగీరథ్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతున్నా.. నిందితుడికి అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా పోస్టులు చేశారు. వారిలో వివాదాస్పదంగా పోస్టులు చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. భగీరథ్‌కు వ్యతిరేకంగా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు కాగా.. నిందితుడికి అనుకూలంగా బాలిక ఫొటోలు, వీడియోలు పోస్టు చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై సైతం కేసు నమోదు అయింది.
ఇది కూడా చదవండి..: Telangana Rain Alert | పలు జిల్లాలకు వర్ష సూచన


