తెలంగాణCm revanth reddy | వచ్చే ఎన్నికల్లో నువ్వానేనా చూసుకుందాం.. కేసీఆర్​కు సీఎం రేవంత్​రెడ్డి సవాల్​

Cm revanth reddy | వచ్చే ఎన్నికల్లో నువ్వానేనా చూసుకుందాం.. కేసీఆర్​కు సీఎం రేవంత్​రెడ్డి సవాల్​

రాష్ట్రంలో ప్రజాపాలన ఎందుకు పోవాలి.. ఒక్క సారి నీకు పదవి ఇవ్వనందుకు ప్రజాపాలన పోవాలా.. మళ్లీ ఆ పాపాల భైరవుడు అధికారంలోకి రావాల్నా అని సీఎం రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cm revanth reddy | రాష్ట్రంలో ప్రజాపాలన ఎందుకు పోవాలి.. ఒక్క సారి నీకు పదవి ఇవ్వనందుకు ప్రజాపాలన పోవాలా.. మళ్లీ ఆ పాపాల భైరవుడు అధికారంలోకి రావాల్నా అని సీఎం రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. ‘చూసుకుందాం కేసీఆర్​.. వచ్చే ఎన్నికల్లో నువ్వానేనా.. ప్రజాపాలనా.. పాపాల భైరవుడా చూసుకుందామని’ సవాల్​ విసిరారు. ‘వచ్చే ఎన్నికల్లో నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొడతా.. 2022లో నిన్ను ఒడగొట్టినా.. జూబ్లీహిల్స్​, కంటోన్మెంట్​లో నీ పార్టీకి ఘోరి కట్టినా.. వచ్చే ఎన్నికల్లో ఆ ఘోరీపై కాంగ్రెస్​ కార్యకర్తలు జెండా ఎగురవేస్తారంటూ’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూపాలపల్లిలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడారు.

Cm revanth reddy | రైతుభరోసా నిధులు విడుదల

కరీంనగర్​ జిల్లా భూపాలపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి వెన్నెముక రైతు అని అన్నారు. ఆ రైతులను నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకుందన్నారు. రైతు సంక్షేమం కాంగ్రెస్​ నినాదమే కాదు.. విధానమని పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకువచ్చిందని హస్తం పార్టీయేనని గుర్తు చేశారు. దేశంలోని వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్​ వన్​గా నిలిచిందన్నారు. దేశంలోనే తొలిసారి పంటలకు ఉచిత కరెంట్​ పథకాన్ని ప్రారంభించింది వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి అని వివరించారు.

Cm revanth reddy | రైతులకు రుణమాఫీ

ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని రేవంత్​ రెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేసి.. అన్నదాతలను రుణవిముక్తులను చేశామని చెప్పారు. అలాగే రైతు భరోసా ఇస్తూ ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. సన్న వడ్లకు బోనస్ అందిస్తూ.. రేషన్​ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

Cm revanth reddy | పార్టీని గుండెల మీద తన్నారు…

జీవన్​రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పెద్దాయన ప్రజాపాలన పోవాలి.. పాపాల బైరవుడు రావాలి అంటున్నారన్నారు. ప్రజాపాలన ఎందుకు పోవాలన్నారు. జగిత్యాల నిన్ను ఓడిస్తే.. నీకు మంత్రి పదవి రాకపోతే ప్రజాపాలన పోవాలా అని ప్రశ్నించారు. ప్రజాపాలన ఎందుకు పోవాలో చెప్పాలని సవాల్​ విసిరారు. 40 ఏళ్లలో కాంగ్రెస్​ కార్యకర్తలు ఆయనను భూజాన మోశారన్నారు. పల్లకీలో అసెంబ్లీకి పంపించారన్నారు. మీ కుటుంబం కోసం కార్యకర్తలు కష్టపడ్డారన్నారు. పార్టీ 14 సార్లు భీఫామ్​ ఇచ్చిందన్నారు. ఒక్క ఏడాది పదవి లేకపోతే పార్టీని గుండెల మీద తన్ని శత్రువు పంచన చేశారని విమర్శించారు.

Cm revanth reddy | డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇచ్చారా..

కేసీఆర్​ ఎర్రవెల్లిలో వెయ్యి ఎకరాల్లో ఫాం హౌస్​ కట్టుకున్నాడు.. జన్వాడాలో కొడుకు ఇల్లు కట్టుకున్నాడు. మొయినాబాద్​ హరీశ్​రావు ఇల్లు కట్టుకున్నాడు.. కానీ ప్రజలకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. తాము ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నందుకు ప్రజాపాలన పోవాలా అని ప్రశ్నించారు. ఉచిత్​ విద్యుత్​, రూ.500 గ్యాస్​ సిలిండర్​, రేషన్​ బియ్యం, ఉచిత బస్సు సౌకర్యం, 70 వేల ఉద్యోగాలు, రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వన్ని ఇస్తున్నందుకు ప్రజాపాలన పోవాలా అని అడిగారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు, దుద్దిళ్ల శ్రీధర్​బాబు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్​, అడ్లూర్​ లక్ష్మణ్​, సీతక్క, వివేక్​ వెంకటస్వామి ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

cm revanth reddy

ఇది కూడా చదవండి..: KCR Jagtial Meeting | నువ్వు వెయ్యి జన్మలు ఎత్తిన చావను.. కేసీఆర్​ కీలక వ్యాఖ్యలు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....