CDPO Caught by ACB | అంగన్​వాడీ కేంద్రాల నుంచి లంచం.. ఏసీబీకి చిక్కిన సీడీపీవో

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సీడీపీవో దరోజు పద్మ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CDPO Caught by ACB | రాష్ట్రంలో ఏసీబీ దాడులు (ACB Raid) జరుగుతున్నా అవినీతి అధికారులు మారడం లేదు. లంచాల కోసం ప్రజలను పట్టి పీడిస్తున్నారు. చివరకు అంగన్​వాడీ కేంద్రాల నుంచి సైతం లంచాలు తీసుకుంటుండటం గమనార్హం. తాజాగా ఓ సీడీపీవో లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా దొరికింది.

జగిత్యాల (Jagtial) జిల్లా, మెట్‌పల్లి సీడీపీవో దరోజు పద్మను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. మెట్‌పల్లి అర్బన్ మండలం పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ సమయంలో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఆమె రూ.63 వేల లంచం డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.63 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సీడీపీవో పద్మను తన కార్యాలయం బయట రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

CDPO Caught by ACB | ప్రతినెలా ఇవ్వాల్సిందే..

సదరు సీడీపీవోకు ప్రతినెలా లంచం ఇవ్వాల్సిందే. లేకపోతే తనిఖీల సమయంలో ఇబ్బందులు పెడుతారు. తన పరిధిలోని మొత్తం 21 అంగన్​వాడీ కేంద్రాల నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ మేరకు మూడు నెలలకు సంబంధించి తాజాగా రూ.63 వేల లంచం తీసుకుంటుండగా సీడీపీవో పట్టుబడ్డారు. ఆమెపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కాగా పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్​వాడీ కేంద్రాల నుంచి లంచాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *