అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Paddy Farmers | రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతుండటంతో రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సీఎం అధికారులకు కీలక సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోళ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు.
Paddy Farmers | క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని ఆదేశించారు. సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.
Paddy Farmers | జాప్యం జరగకుండా..
ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ విషయంలో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలతో పని చేయించుకోవాలన్నారు.
లారీల కొరత ఉంటే దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించుకోవాలని ఆదేశించారు. ధాన్యం నిల్వ చేయడానికి గోదాములు లేకపోతే రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తీసుకుని ధాన్యాన్ని తరలించాలి. నిర్లక్ష్యం వహించే అధికారులు, కలెక్టర్లపై చర్యలకు ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Liquor Scam | మద్యం షాపుల్లో బినామీల రాజ్యం.. ఎస్సీ కోటాపై ఐటీ శాఖ పంజా

