అక్షరటుడే, వెబ్‌డెస్క్: Breakfast Scheme Launch | వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పున : ప్రారంభం అయ్యాయి. చాలా రోజుల తర్వాత విద్యార్థులు బడిబాట పట్టారు. తొలి రోజు కావడంతో చాలా మంది పాఠశాలకు వెళ్లలేదు.
రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తామని గతంలో ప్రకటించింది. ఈ మేరకు సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్, మిల్క్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్వినీ రెడ్డి , కలెక్టర్ ప్రియాంక ఆలా, డీఈవో యాదయ్య, మన్నా ట్రస్ట్ సీఈవో లీనా జోసెఫ్ పాల్గొన్నారు.
Breakfast Scheme Launch | అన్ని పాఠశాలల్లో..
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్నారు. ఉదయం విద్యార్థులకు టిఫిన్‌తో పాటు, పాలు అందించనున్నారు. ఈ మేరకు గతంలోనే ప్రభుత్వం మెను విడుదల చేసింది. ఈ పథకాన్ని ప్రభుత్వ బడుల్లో ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Singareni Medical Board | సింగరేణి మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలి : కవిత