అక్షరటుడే వెబ్‌డెస్క్: Raghava Lawrence Controversy | ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి. ఒక ప్రెస్‌మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా చిత్రీకరించడంతో, లారెన్స్ తాజాగా వివరణ ఇచ్చారు.
Raghava Lawrence Controversy | ఏమిటా వివాదం?
ఇటీవల రాజకీయాల్లోకి వచ్చే అంశంపై మాట్లాడిన లారెన్స్, కొత్త ప్రభుత్వంపై స్పందిస్తూ ఒక ఉదాహరణ చెప్పారు. “మనం ఏదైనా కొత్త ఇంటికి మారినప్పుడు, ఆ పరిసరాలను, అక్కడి పరిస్థితులను, చివరికి అక్కడ ఉండే కుక్కల అలవాట్లను అర్థం చేసుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. అదేవిధంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా అక్కడి వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సమయం అవసరమని” ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకున్న కొందరు, లారెన్స్ ప్రజలను ఉద్దేశించే “కుక్కలు” అని సంబోధించారని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.
Raghava Lawrence Controversy | లారెన్స్ స్పందన ఇదే..
ఈ వివాదం ముదరడంతో లారెన్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “నా అభిమానులు, ప్రజలు నాకు అమ్మతో సమానం. నేను ప్రజలను ఎప్పుడూ గౌరవిస్తాను. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుందనే ఉద్దేశంతోనే నేను ఆ ఉదాహరణ చెప్పాను. అంతేకానీ, ప్రజలను కుక్కలతో పోల్చే అంతటి కఠిన హృదయుడిని కాను. దయచేసి వీడియోను పూర్తిస్థాయిలో చూసి, నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి” అని ఆయన కోరారు. ఇది పూర్తిగా తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
“மக்கள் தெருநாய்களா ? -நடிகர்
ராகவா லாரன்ஸ் விளக்கம் !”#RaghavaLawrence #TNPolitics #tvkvijay #arrowroots pic.twitter.com/kWepG6xmHr— Arrowroots Media (@arrowrootsmedia) June 15, 2026
ఇది కూడా చదవండి: Power Cuts in Nizamabad | అర్ధరాత్రి చిమ్మచీకట్లు.. తరచూ విద్యుత్ కోతలతో అవస్థలు