అక్షరటుడే, వెబ్డెస్క్ : Train Robbery Attempt | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కదులుతున్న రైలులో అర్ధరాత్రి ప్రయాణికులను దోపిడీ చేసేందుకు యత్నించారు. సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు తమిళనాడు రాష్ట్రం చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
రైలు కాకినాడ జిల్లా బాపట్ల శివారు నల్లమడ వాగు రైల్వే వంతెన దగ్గరకు రాగానే. ఎస్-3, ఎస్-6 బోగీల్లో దొంగలు చొరబడ్డారు. నిద్రపోతున్న ఇద్దరు మహిళల నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. అయితే వారు వెంటనే లేచి అరిచారు. ప్రయాణికులు కేకలు వేయడంతో దొంగలు భయపడ్డారు. వెంటనే చైన్ లాగి కిందకు దూకారు. రైలులోనే ఉన్న రైల్వే పోలీసులు దొంగలపై కాల్పులు జరిపారు. అయితే చీకటి కావడంతో అడవిలో దొంగలు తప్పించుకున్నారు.
Train Robbery Attempt | గాలింపు చర్యలు

రైల్వే పోలీసులు దొంగలపై 9 రౌండ్ల కాల్పులు జరిపారు. అయినా వారు తప్పించుకున్నారు. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలసీఉలు దుండగుల కోసం అప్పికట్ల-బత్తిపూడి పొలాల్లో గాలిస్తున్నారు. కాగా గతంలో సైతం దేశంలోని పలు రైళ్లలో దొంగలు దోపిడీ చేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైళ్లలో భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Jnaneshwari Missing Case | చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్