Bharat Gas Theft | నగరంలో దొంగల హల్​చల్​.. భారత్​ గ్యాస్​ ఏజెన్సీలో చోరీ..

నిజామాబాద్​ నగరంలోని భారత్​ గ్యాస్​ ఏజెన్సీలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Bharat Gas Theft | నగరంలో వరుస చోరీలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు తేడా లేకుండా దొంగలు హల్​చల్​ చేస్తున్నారు. దోపిడీలకు పాల్పడుతున్నారు.

Bharat Gas Theft | భారత్​ గ్యాస్​ ఏజెన్సీలో..

Bharat Gas Theft

వన్​ టౌన్​ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. తిలక్​గార్డెన్​ సమీపంలోని భారత్​ గ్యాస్ ఏజెన్సీ (Bharat Gas Agency)లో​ ఆదివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ముందుగా తాళాలు పగులగొట్టిన అనంతరం సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లను కట్​ చేశారు. అనంతరం లోపలికి వెళ్లి లాకర్​ను ధ్వంసం చేశారు.  క్లూస్​ టీం ప్రతినిధులు సంఘటనాస్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. సుమారు రూ.70వేలు చోరీకి గురైనట్లు ఏజెన్సీ నిర్వాహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపారు.

ఇది కూడా చదవండి..: School Buses | స్కూల్​ బస్సులను తనిఖీ చేసిన రవాణాశాఖ అధికారులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *