School Buses | స్కూల్​ బస్సులను తనిఖీ చేసిన రవాణాశాఖ అధికారులు

ఉమ్మడిజిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో రవాణా శాఖ పాఠశాల బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: School Buses | ఉమ్మడిజిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో రవాణా శాఖ (transport department) పాఠశాల బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

School Buses | నగరంలో ప్రత్యేక తనిఖీలు..

డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ దుర్గాప్రమీల (DTC Durga Pramila) ఆదేశాల మేరకు డీటీవో రమేష్​ రాథోడ్​ ఆధ్వర్యంలో అధికారులు నగరంలో ప్రత్యేక తనిఖీలు(bus inspection) చేపట్టారు. ముఖ్యంగా స్కూల్​ బస్సులు ఫిట్​గా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. బస్సు డ్రైవర్ల లైసెన్స్​లు, వాహనాల పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం డీటీవో రమేష్​ రాథోడ్​ మాట్లాడుతూ.. చిన్నారులతో వెళ్లే బస్సులను వేగంగా నడపవద్దని సూచించారు. విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు.. దిగేటప్పుడు అనుక్షణం డ్రైవర్లు గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. ఫిట్​నెస్​ లేని బస్సులు ఎట్టిపరిస్థితుల్లో రోడ్డు ఎక్కవద్దని హెచ్చరించారు. తనిఖీలులో ఎంవీఐలు, ఏఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు.

rta11

ఇది కూడా చదవండి : Casting Artist Harassment | కోరిక తీరిస్తేనే సినిమాల్లో ఛాన్స్.. యువనటిని వేధించిన క్యాస్టింగ్​ ఆర్టిస్ట్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *