Casting Artist Harassment | కోరిక తీరిస్తేనే సినిమాల్లో ఛాన్స్.. యువనటిని వేధించిన క్యాస్టింగ్​ ఆర్టిస్ట్​

ఓ యువనటిని క్యాస్టింగ్​ ఆర్టిస్ట్​ ప్రసాద్ అనే వ్యక్తి వేధించాడు. తన కోరిక తీరిస్తే సినిమాల్లో అవకాశం కల్పిస్తానని వేధింపులకు పాల్పడ్డాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Casting Artist Harassment | సినీ పరిశ్రమ (Film industry).. అదొక రంగుల ప్రపంచం.. చాలా మంది వెండితెరపై తమను తాము చూసుకోవాలని కలలు కంటారు. దీని కోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. సినీ పరిశ్రమలో ఉన్నవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అయితే ఇలా సినిమా అవకాశాల కోసం వచ్చే యువతులను కొందరు వేధిస్తున్నారు.

సినిమా అవకాశాలు కావాలంటే తమ కోరిక తీర్చాలంటూ కొందరు వేధింపులకు పాల్పడుతున్నారు. తాము చెప్పినట్లు చేస్తే సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తామని యువతుల జీవితాలో ఆడుకుంటున్నారు. ఇలాంటి ఘటన తాజాగా హైదరాబాద్ (Hyderabad)​లో వెలుగు చూసింది. యువనటిని క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్​ అనే వ్యక్తి వేధించారు. కొన్నేళ్లుగా సినీ రంగంలో ఉన్న ఓ యువనటి(21)కి ఓ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ సంప్రదించాడు.

Casting Artist Harassment | డబ్బులు ఇవ్వకుండా..

అతడు చెప్పినట్లు సినిమాలో అవకాశం ఇప్పించాడు. 2025 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తవగా, నటికి ఇవ్వాల్సిన రూ.90 వేల పారితోషికం, రూ.38 వేల ప్రయాణ చార్జీలు ఇవ్వకుండా ప్రసాద్ తప్పించుకుంటున్నాడు. డబ్బుల కోసం అడగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన తనను కలవమని చెప్పాడు. అనంతరం ఆమెనుబలవంతంగా కారులో ఎక్కించుకుని, తన కోరిక తీరిస్తే ఇతర సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని సదరు నటిపై లైంగిక దాడికి యత్నించాడు.

Casting Artist Harassment | పోలీసులకు ఫిర్యాదు

నిందితుడి నుండి తప్పించుకుని, జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె ప్రసాద్‌ను నిలదీసింది. దీంతో ప్రసాద్ బాధితురాలి తల్లిని కూడా దూషించడంతో పాటు డబ్బులు ఇవ్వనని చెప్పాడు. అంతేగాకుండా గతంలో సైతం తాను ఇలాగే యువతులను వాడుకొని డబ్బులు సంపాదించానని చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Vijay Deverakonda Scholarship | రష్మికతో సొంతూరికి విజయ్.. 180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *