అక్షరటుడే, వెబ్‌డెస్క్: Airtel YouTube Premium | ప్రీపెయిడ్ మొబైల్ Mobile వినియోగదారులకు సరికొత్త డిజిటల్ వినోదాన్ని అందించేందుకు ప్రముఖ టెలికాం దిగ్గజం ‘ఎయిర్టెల్’ సిద్ధమైంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘యూట్యూబ్’ (YouTube) తో ఎయిర్టెల్ ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కాంబో ద్వారా యూజర్లకు ఉచితంగా ‘యూట్యూబ్ ప్రీమియం’ ప్రయోజనాలను అందించనుంది.
Airtel YouTube Premium | ప్రీమియంతో కలిగే ప్రయోజనాలు
యాడ్-ఫ్రీ కంటెంట్: వీడియోలు, షార్ట్స్ చూస్తున్నప్పుడు మధ్యలో ఎలాంటి ప్రకటనలు (Ads) రావు.
బ్యాక్‌గ్రౌండ్ ప్లే: స్క్రీన్ లాక్ చేసినా లేదా ఇతర యాప్స్ వాడుతున్నా బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో/ఆడియో ప్లే అవుతుంది.
ఆఫ్‌లైన్ డౌన్లోడ్స్: వైఫై లేని సమయంలో చూసేందుకు వీడియోలను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసుకోవచ్చు.
యూట్యూబ్ మ్యూజిక్: లక్షలాది పాటలను ప్రకటనలు లేకుండా ఉచితంగా వినవచ్చు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Airtel YouTube Premium | రూ.200 ఓటీటీ ప్యాక్‌తో మరిన్ని ప్రయోజనాలు
ఈ ఆఫర్ అందుకోవడానికి కస్టమర్లు 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ.200 ఓటీటీ యాడ్-ఆన్ ప్యాక్‌తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అదనపు డేటా: ఈ ప్యాక్‌తో 30 జీబీ అదనపు డేటా ఉచితంగా లభిస్తుంది.
18+ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు: యూట్యూబ్ ప్రీమియంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5 (ZEE5), సోనీలివ్ (SonyLIV) సహా సుమారు 18కి పైగా ప్రముఖ ఓటీటీ యాప్‌ల సబ్స్క్రిప్షన్లు ఈ ప్యాక్‌లోనే లభించనున్నాయి.
ఎక్కువ డేటాతో పాటు అంతరాయం లేని వినోదాన్ని కోరుకునే వారికి ఎయిర్టెల్ తెచ్చిన ఈ కొత్త ప్యాక్ ఎంతో లాభదాయకంగా మారనుంది.