Thanjavur police inspector bribe | పోలీస్ ఇన్స్పెక్టర్ ముందే రూ.5 కోట్ల నోట్ల కట్టలు.. వైరల్ వీడియోతో ఖాకీ బాస్ లంచావతారం బట్టబయలు!

ఆసుపత్రి భాగస్వాములు డబ్బుల లెక్కల గురించి మాట్లాడుకుంటుండగా.. ఇన్​స్పెక్టర్​ సుకుమారన్ సమక్షంలోనే ఈ నగదు మార్పిడి జరగడం గమనార్హం.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Thanjavur police inspector bribe | రక్షించాల్సిన భక్షకులైతే… న్యాయం అందించాల్సిన పీఠంపైనే అక్రమ దందాలు సాగితే? ఖాకీ డ్రెస్సుకు మరక తెచ్చేలా తమిళనాడులోని తంజావూరులో వెలుగుచూసిన ఓ ఘోర అవినీతి ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీస్ అధికారి సమక్షంలోనో ఏకంగా కోట్ల రూపాయల లంచం చేతులు మారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం పోలీసు వ్యవస్థ తీరుపై తీవ్ర ఆగ్రహజ్వాలలు రగిలిస్తోంది.

Thanjavur police inspector bribe | అసలేం జరిగింది?

తంజావూరు Thanjavur  లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి Hospital భాగస్వాముల (పార్టనర్స్) మధ్య కొంతకాలంగా తీవ్ర ఆర్థిక వివాదాలు నడుస్తున్నాయి. ఈ వివాదాన్ని సర్దుబాటు చేసి, తమకు అనుకూలంగా పరిష్కరించడానికి పోలీస్ ఇన్స్పెక్టర్ సుకుమారన్ జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెటిల్‌మెంట్ కోసం ఏకంగా రూ.5 కోట్ల భారీ లంచం డిమాండ్ చేశారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Thanjavur police inspector bribe | వైరల్ వీడియోలో కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు..

తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో… సంచుల్లో తీసుకొచ్చిన రూ.500 నోట్ల కట్టలను టేబుల్‌పై గుట్టలుగా ఉంచడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రి భాగస్వాములు డబ్బుల లెక్కల గురించి మాట్లాడుకుంటుండగా.. ఇన్​స్పెక్టర్​ సుకుమారన్ సమక్షంలోనే ఈ నగదు మార్పిడి జరగడం గమనార్హం.

కేవలం కిందిస్థాయి అధికారులే కాకుండా, ఉన్నతాధికారుల ఆదేశాలు, వారి అభయంతోనే ఈ స్థాయిలో కోట్ల రూపాయల లంచాల దందా నడిచిందనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది.

Thanjavur police inspector bribe | చట్టం ముందుకు తేవాల్సిందే!

ప్రజలకు రక్షణగా నిలవాల్సిన రక్షకభటులే సెటిల్‌మెంట్ దందాలకు పాల్పడుతూ, నోట్ల మూటల మధ్య డీల్స్ కుదుర్చుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు, ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వ్యవస్థకే ముల్లులా మారిన ఇలాంటి అవినీతి అధికారులపై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *