అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi SRCC | ఢిల్లీలో శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi SRCC) పాల్గొన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్ అన్నారు.
మోదీ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం గురించి, ముఖ్యంగా 2013లో తాను చేసిన ప్రసంగం గురించి చర్చ జరుగుతోందన్నారు. ఆ ప్రసంగం ఒక అలలాంటి ప్రభావాన్ని సృష్టించిందన్నారు. SRCC పూర్వ విద్యార్థులు ఎంతో ప్రత్యేకమైనవారన్నారు. ఇక్కడి పూర్వ విద్యార్థులు ‘OGs’ (అసలైన దిగ్గజాలు) అని పేర్కొన్నారు. వారు కాలేజీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయడమే కాకుండా, వివిధ రంగాలలో తమకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారని కొనియాడారు. అరుణ్ జైట్లీ ఇక్కడే చదువుకున్నారని గుర్తు చేశారు.
PM Modi SRCC | అనేక మార్పులు తెచ్చాం
తాను చెప్పే మాటలను తీసుకుని, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఆపాదించే ఒక ముఠా ఉందని మోదీ అన్నారు. 2013 ఆ కాలంలో మీడియాలో ఎక్కువగా నియంత్రణ రేఖ (LoC) వెంబడి భారతీయ సైనికులు చంపబడే వార్తలు కనిపించేవన్నారు. ప్రపంచ బ్యాంక్ తన జీడీపీ (GDP) వృద్ధి అంచనాలను తగ్గించింది. కరెంట్ అకౌంట్ లోటు (current account deficit) అత్యధిక స్థాయికి చేరింది. ద్రవ్యోల్బణం దాదాపు 10 శాతంగా ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరిగాయన్నారు. వృద్ధి రేటు అట్టడుగున ఉండగా, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. ఉగ్రవాదులు అడ్డుఅదుపు లేకుండా కార్యకలాపాలు సాగించేవారన్నారు. 2014లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో అనేక మార్పులు తెచ్చామన్నారు. ఈ త్రైమాసికంలో భారత్ 7.8శాతం జీడీపీ వృద్ధిరేటు నమోదు చేసిందన్నారు.
PM Modi reminds the nation of the pre-2014 era, when our soldiers faced border attacks along the LoC, economic growth hit rock bottom, and inflation touched the sky.
A stark reminder of how far we have come!#PMModiAtSRCC pic.twitter.com/61dv8UzhC5
— Varun Kumar Rana (@VarunKrRana) September 5, 2026
దీనిని కూడా చదవండి : Konda Surekha Rakhi | కొండా సురేఖతో అందుకే రాఖీ కట్టించుకున్న : సీఎం రేవంత్ రెడ్డి