జాతీయంTamil Nadu Hung Assembly | విజయ్‌ ప్రమాణస్వీకారానికి బ్రేక్.. మెజార్టీ లేదని పర్మిషన్ ఇవ్వని...

Tamil Nadu Hung Assembly | విజయ్‌ ప్రమాణస్వీకారానికి బ్రేక్.. మెజార్టీ లేదని పర్మిషన్ ఇవ్వని గవర్నర్!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK)కు అధికార పీఠాన్ని దక్కించుకోవడంలో ఊహించని అడ్డంకి ఎదురైంది.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Tamil Nadu Hung Assembly|తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK)కు అధికార పీఠాన్ని దక్కించుకోవడంలో ఊహించని అడ్డంకి ఎదురైంది. ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసినా, మ్యాజిక్ ఫిగర్ విషయంలో విజయ్ ఇచ్చిన వివరణపై గవర్నర్ సంతృప్తి చెందకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి లభించలేదు. రాజ్యాంగ నిబద్ధత ప్రకారం సంపూర్ణ మెజార్టీ ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తామని గవర్నర్ స్పష్టం చేయడంతో ప్రస్తుతానికి ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

Tamil Nadu Hung Assembly|మెజార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేల లోటు..

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, ప్రస్తుత లెక్కల ప్రకారం విజయ్ పార్టీకి కేవలం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. తన వద్ద ఉన్న బలాన్ని నిరూపించుకోవడంలో విజయ్ విఫలం కావడంతో పాటు, లోటుగా ఉన్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతును భర్తీ చేసే విషయంలో గవర్నర్‌ను ఒప్పించలేకపోయారు. “ప్రభుత్వ ఏర్పాటుకు ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందే” అని గవర్నర్ తేల్చి చెప్పారు.

Tamil Nadu Hung Assembly|రాజకీయ అనిశ్చితిలో తమిళనాడు..

విజయ్‌కు మెజార్టీ లభించని ఈ తరుణంలో గవర్నర్ తదుపరి అడుగుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ఇతర ప్రధాన పార్టీలైన ఏఐడీఎంకే (AIADMK) లేదా డీఎంకే (DMK)కు అవకాశం ఇస్తారా, లేక రాష్ట్రం హంగ్ అసెంబ్లీ దిశగా వెళ్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు, అవసరమైన మద్దతును కూడగట్టేందుకు స్వతంత్రులు , ఇతర చిన్న పార్టీల ఎమ్మెల్యేలతో టీవీకే శ్రేణులు సంప్రదింపులు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా అనిశ్చితిలోకి వెళ్లాయి.

ఇది కూడా చదవండి: Minimum Pension Hike | కనీస పెన్షన్ రూ. 7,500.. పెంపు యోచనలో కేంద్ర ప్రభుత్వం!

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Summer special camps | ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి ప్రత్యేక శిబిరాలు: డీఈవో రాజు

అక్షరటుడే, కామారెడ్డి: Summer special camps | జిల్లాలోని 6 నుండి...

Election Commission Case|సుప్రీంకోర్టులో కేంద్రానికి షాక్.. ఆ విన్నపాన్ని తోసిపుచ్చిన ధర్మాసనం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Election Commission Case|కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC), ఎన్నికల...

Metro Phase 2 | మెట్రో ఫేజ్​–2కు ఆమోదం తెలపాలి.. కేంద్ర మంత్రిని కోరిన సీఎం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Metro Phase 2 | హైద‌రాబాద్ మెట్రో...