అక్షరటుడే, వెబ్డెస్క్ : Mumbai Heavy Rains | కుండపోత వర్షాలతో ముంబై మహానగరం వణికిపోతోంది. అంధేరి సబ్‌వే, ఎయిర్‌పోర్ట్ పరిసరాలు జలమయం కాగా, రవాణా పూర్తిగా స్తంభించింది. రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ముంబై, దాని పొరుగు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలకు IMD ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. అదే సమయంలో, భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు మరియు బలమైన గాలుల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది.

Mumbai Heavy Rains | విద్యార్థులకు కరెంట్ షాక్
నవీ ముంబైలో భారీ వర్షాల మధ్య ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నెరూల్‌లోని ఎల్.పి. బ్రిడ్జ్ కింద ఉన్న ‘బికనీర్ స్వీట్స్’ ముందు విద్యుత్ తీగలలో షార్ట్ సర్క్యూట్ సంభవించి, విద్యుత్ ప్రవాహం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఇద్దరు కళాశాల విద్యార్థినులు ఆ విద్యుత్ ప్రవాహానికి గురై, షాక్ తగలడంతో నీటిలో పడిపోయారు. స్థానికులు వెంటనే వారిద్దరినీ డి.వై. పాటిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
Heavy rains continue to wreak havoc in Thane district, including Mumbai. On Mumbra Road, a car was completely submerged amid severe waterlogging. Continuous rainfall has disrupted life in several areas. The administration has appealed to citizens to venture out only if absolutely… pic.twitter.com/ua4cMrJNEy
— Siraj Noorani (@sirajnoorani) July 1, 2026
దీనిని కూడా చదవండి : Delhi Pollution Control | ఆ వాహనాలకు ఇంధనం బంద్.. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు