అక్షరటుడే, కోల్‌కతా: Amit Shah | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు రాబోతోందని, తొలి దశ ఎన్నికలతోనే బీజేపీ (BJP) విజయం ఖరారైపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
Amit Shah | అమిత్ షా ధీమా:
మొదటి విడతలో పోలింగ్ జరిగిన 152 స్థానాలకు గాను, బీజేపీ ఏకంగా 110 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకోబోతోందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
ఓటింగ్ శాతమే నిదర్శనం: “బెంగాల్ ప్రజలు ఫస్ట్ ఫేజ్‌లోనే తమ భవిష్యత్తును నిర్ణయించుకున్నారు. రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగ్ శాతమే ఇందుకు నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు.
దీదీకి ఇక సెలవు: “దీదీ (Mamata Banerjee) ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం” అంటూ అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మోదీ (PM Modi) నాయకత్వంలోని అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి..: IRCTC Package | పూరీ, కాశీ, అయోధ్య దర్శనాలు.. ఐఆర్‌సీటీసీ మరో ఆధ్యాత్మిక ప్యాకేజీ

