Nashik BPO Case | టీసీఎస్​ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. నిందితురాలికి ముందస్తు బెయిల్​ నిరాకరణ!

Naresh Chandan
Nida Khan Arrest

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nashik BPO Case | నాసిక్‌లోని టీసీఎస్ బీపీవోలో మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నీదా ఎజాజ్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నాసిక్ కోర్టు శనివారం తిరస్కరించింది.

అదనపు సెషన్స్ న్యాయమూర్తి కె.జి. జోషి ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 27న ఇన్‌కెమెరా విచారణ నిర్వహించారు. కాగా, శనివారం తుది నిర్ణయం వెలువరించారు. ఈ సందర్భంగా ఖాన్‌కు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్​ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

Nashik BPO Case | మత మార్పిడి..

ఈ కేసులో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరిపినట్లు, అలాగే మత మార్పిడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డియోలాలి, ముంబై నాకా పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌లలో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ఒక ఆపరేషన్స్ మేనేజర్ కూడా ఉన్నారు.

ఫిర్యాదుల ప్రకారం, బాధిత మహిళలను బెదిరించడం, పబ్లిక్‌గా అవమానించడం, ప్రతికూల వర్క్‌ప్లేస్ రిపోర్టులు ఇవ్వడం, మత భావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు అరెస్టు కాని ఏకైక నిందితురాలు ఖాన్ కాగా, ఆమెపై హిందూ దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

Nashik BPO Case | గర్భధారణను కారణంగా

తన గర్భధారణను, ఎఫ్‌ఐఆర్ నమోదులో ఆలస్యాన్ని కారణంగా చూపుతూ ఖాన్ తరఫు న్యాయవాదులు రాహుల్ కస్లీవాల్, బాబా సయ్యద్ ముందస్తు బెయిల్ కోరారు. అయితే ఆమె తాత్కాలిక ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే ఏప్రిల్ 20న తిరస్కరించింది.

వాదనలు వినిపిస్తూ, మహారాష్ట్రలో బలవంతపు మత మార్పిడిపై ప్రత్యేక చట్టం లేదని, భారతీయ న్యాయ సంహిత కింద సంబంధిత సెక్షన్లు స్పష్టంగా ప్రయోగించలేదని ఖాన్ తరఫు న్యాయవాది వాదించారు. ఒకే ఘటనకు సంబంధించిన పలు ఎఫ్‌ఐఆర్‌లను కలిపి విచారించాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రస్తావించారు.

ఇక ప్రత్యేక ప్రజా అభియోగాధికారి అజయ్ మిసర్ కేసు రికార్డులు, పోలీస్ డైరీలను సమర్పిస్తూ, వెనుకబడిన వర్గానికి చెందిన మహిళను లక్ష్యంగా చేసుకున్న పన్నాగం ఉందని ఆరోపించారు. బాధితురాలికి మత సంబంధిత విషయాలు చూపించి, ఇస్లామిక్ ఆచారాలను అనుసరించేందుకు ప్రోత్సహించడంతో పాటు మలేసియా సంబంధిత వాగ్దానాలతో ప్రలోభపెట్టినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది.
ఈ కేసులో రాష్ట్రం తరఫున అజయ్ మిసర్‌తో పాటు కిరణ్ బెంధ్‌భర్, రేష్మా జాధవ్ తదితరులు వాదనలు వినిపించారు.

Mumbai Family Death Mystery | పుచ్చకాయ తిని.. ఒక ఫ్యామిలీ చనిపోయిందన్న కేసులో బిగ్ ట్విస్ట్!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *