Mumbai Family Death Mystery | పుచ్చకాయ తిని.. ఒక ఫ్యామిలీ చనిపోయిందన్న కేసులో బిగ్ ట్విస్ట్!

Naresh Chandan
Mumbai Family Death Mystery

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mumbai Family Death Mystery | ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవడంతో ఈ మరణాలు సంభవించాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజా ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదిక ఆ అనుమానాలను పూర్తిగా ఖండించింది.

Mumbai Family Death Mystery | ఆకుపచ్చ రంగులోకి అవయవాలు

ముంబైలో చోటుచేసుకున్న ఈ ఘటనలో.. బాధితులు పుచ్చకాయ తినడం వల్ల మరణించలేదని వైద్యులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కుటుంబ పెద్ద అబ్దుల్లా శరీరంలో ‘మార్ఫిన్’ అనే శక్తివంతమైన నొప్పి నివారణ మందు ఆనవాళ్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇది కేసులో అనుమానాలను మరింత పెంచుతోంది.

ఫోరెన్సిక్ పరిశీలనలో భాగంగా బాధితుల మెదడు, గుండె, పేగులు వంటి అంతర్గత అవయవాలు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఫుడ్ పాయిజన్ కేసుల్లో ఇలాంటి లక్షణాలు కనిపించవని వారు పేర్కొన్నారు. ఇదే సమయంలో, ఇంట్లో ఉన్న పుచ్చకాయతో పాటు ఇతర ఆహార పదార్థాలను పరీక్షించగా, ఎలాంటి కృత్రిమ రసాయనాలు లేవని నివేదిక వెల్లడించింది.

ఈ పరిణామాలతో కేసు దిశ పూర్తిగా మారింది. ఇది హత్యా? లేక ఆత్మహత్యనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల మరణాలకు అసలు కారణం ఏమిటన్నది వెలికితీయడానికి మరింత లోతైన విచారణ చేపట్టినట్లు సమాచారం.

Union Bank Apprentice | యూనియన్ బ్యాంక్​లో అప్రెంటిస్ పోస్టులు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *