జాతీయంUnion Bank Apprentice | యూనియన్ బ్యాంక్​లో అప్రెంటిస్ పోస్టులు

Union Bank Apprentice | యూనియన్ బ్యాంక్​లో అప్రెంటిస్ పోస్టులు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు గడువు ఈనెల 19తో ముగియనుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Union Bank Apprentice | బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి యూనియన్ బ్యాంక్ (Union Bank) శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 1,865 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

ముంబయి కేంద్ర కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ నియామకాలు అప్రెంటిసెస్ చట్టం 1961 ప్రకారం ఒక సంవత్సరం శిక్షణ ప్రాతిపదికన జరుగుతాయి. ఎంపికైన వారికి పోస్టింగ్ ప్రాంతాన్ని బట్టి నెలవారీ స్టైఫండ్​ చెల్లిస్తారు. ఇది శాశ్వత ఉద్యోగం కాకపోయినా బ్యాంకింగ్ రంగంలో అనుభవం సంపాదించేందుకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.

Union Bank Apprentice | అప్రెంటిస్ పోస్టులు..

1,865. (దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పోస్టులు ఉన్నాయి)

వేతనం వివరాలు..

గ్రామీణ /సెమీ అర్బన్ ప్రాంతాలు : రూ. 15 వేలు
అర్బన్ ప్రాంతాలు : రూ. 18 వేలు
మెట్రో నగరాలు : రూ. 20 వేలు

వయో పరిమితి : 2026 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

Union Bank Apprentice | గమనించాల్సిన విషయాలు..

ఇంతకుముందు యూనియన్ బ్యాంక్‌లో లేదా ఇతర సంస్థల్లో అప్రెంటిస్ శిక్షణ పొందిన వారు అర్హులు కారు. అలాగే ఏడాది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగ అనుభవం ఉన్నవారు కూడా అనర్హులే.
ఏ రాష్ట్రానికి దరఖాస్తు చేస్తే.. ఆ రాష్ట్ర స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. దీనిని ఎంపికలో ముఖ్య అర్హతగా పరిగణిస్తారు.

దరఖాస్తు గడువు : మే 19.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా

పూర్తి వివరాలకు యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్​లో సంప్రదించగలరు.

ఇది కూడా చదవండి..: IPL Betting Suicide | ఐపీఎల్ బెట్టింగ్​కు బలి.. ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Public Governance Meeting | అధికారులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలి: అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు: Public Governance Meeting | ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు...

Minority School Admissions | ఎల్లారెడ్డి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Minority School Admissions | పట్టణంలోని తెలంగాణ మైనార్టీ...