IPL Betting Suicide | ఐపీఎల్ బెట్టింగ్​కు బలి.. ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL Betting Suicide | ఐపీఎల్​ బెట్టింగ్​ భూతానికి మరొకరు బలి అయ్యారు. ఉత్తర ప్రదేశ్​ (Uttar Pradesh)లోని లక్నోకు చెందిన 35 ఏళ్ల వ్యాపారి బెట్టింగ్​లో నష్టపోవడంతో 11వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

సీతాపూర్‌కు చెందిన ప్రబల్ జైన్, గుడంబా పోలీస్ స్టేషన్ (Gudamba Police Station) పరిధిలోని ‘జనేశ్వర్ అపార్ట్‌మెంట్’లో అద్దెకు నివసించేవాడు. 8 నెలల క్రితమే అతనికి ప్రేమ వివాహం జరిగింది. అతను ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లపై బెట్టింగ్​ వేసేవాడు. గురువారం ఆర్​సీబీ, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అతను లక్షల రూపాయలు కోల్పోయాడు. అనంతరం తన భార్యకు ఫోన్ చేశాడు. తాను సర్వం కోల్పోయానని ఏడుస్తూ చెప్పాడు. ఆమె ఓదార్చడానికి యత్నించినా.. అతడు మ్యాచ్​ జరుగుతుండగానే అపార్ట్​మెంట్ బాల్కనీ నుంచి కిందకు దూకేశాడు.

IPL Betting Suicide | సూసైడ్​ నోట్

ఆ యువకుడు కింద పడిన శబ్దం విని, ఆ సొసైటీకి చెందిన ప్రజలు అక్కడికి పరుగున వెళ్లారు. అప్పటికే ప్రబల్​ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి సూసైడ్​ నోట్​ (Suicide Note) లభించింది. అందులో ప్రబల్ మ్యాచ్‌లో డబ్బు కోల్పోయిన విషయం గురించి రాశాడు. ఈ ఘటనపై ఘజియాబాద్ ACP అనింద్య విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ కూడా లభించిందని తెలిపారు. ఆ మ్యాచ్‌లో తాను డబ్బు కోల్పోయినట్లు అందులో పేర్కొన్నాడు. అతను తన భార్యకు, కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాడన్నారు.

ఇది కూడా చదవండి..: Cooking Oil Price Rise | భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *