అక్షరటుడే, వెబ్‌డెస్క్: 8th Pay Commission Demands | ఎనిమిదో వేతన సవరణ కోసం కేంద్ర ప్రభుత్వ (Central Government) ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వేతన కమిషన్ సంప్రదింపుల దశలో ఉంది. ఇప్పటికే బీపీఎంఎస్, పీఎస్ఎన్ఎం, ఎన్ సీ -జేసీఎం తదితర సంఘాలు తమ ప్రతిపాదనలను కమిషన్ కు అందించాయి. వాటిని కమిషన్ సమీక్షిస్తోంది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్టేక్‌హోల్డర్లతో సమావేశాలూ నిర్వహిస్తోంది. కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ (Ranjana Prakash Desai) నేతృత్వంలోని బృందం.. ఉద్యోగుల ఆకాంక్షలు, సమస్యలను విని తుది నివేదిక సమర్పించే ముందు ఈ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు స్టేక్‌హోల్డర్లు మెమోరాండాలు సమర్పించడానికి అవకాశం ఉంది.
8th Pay Commission Demands | బీపీఎంఎస్ (భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్) డిమాండ్లు..
ప్రస్తుత ద్రవ్యోల్బణ స్థాయికి అనుగుణంగా వేతనాలను సర్దుబాటు చేయాలని బీపీఎంఎస్ డిమాండ్ చేస్తోంది. కనీస వేతనం రూ. 72 వేలు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 4 రెట్లు, వార్షిక ఇంక్రిమెంట్ 6 శాతం ఉండాలని కోరుతోంది.
పీఎస్ఎన్ఎం(ప్రగతిశీల శిక్షక్ న్యాయ మంచ్) డిమాండ్లు..
కేంద్రీయ విద్యాలయాలు (Kendriya Vidyalayas), నవోదయ విద్యాలయాలలో పనిచేస్తున్న టీచర్లకు కనీస వేతనం రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు ఉండాలని, హెచ్ ఆర్ ఏ 36 శాతం వరకు పెంచాలని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని, రిటైర్‌మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తోంది.
ఎన్సీ -జేసీఎం (నేషనల్ కౌన్సిల్ – జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం) డిమాండ్లు..
కనీస వేతనం రూ. 69 వేలు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.833, వార్షిక ఇంక్రిమెంట్ 6 శాతం, న్యూట్రిషన్ -లింక్డ్ వేజ్ స్ట్రక్చర్, పే మెట్రిక్స్ సరళీకరణ (లెవల్ 13 వరకు) ఉండాలని కోరుతోంది. అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, హెచఆర్ ఏ పెంపు కూడా డిమాండ్ చేస్తోంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి?
ప్రస్తుత బేసిక్ పే ను ఒక నిర్దిష్ట సంఖ్యతో గుణించి కొత్త వేతన నిర్మాణాన్ని లెక్కించడానికి ఉపయోగపడే మల్టిప్లయర్ ను ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ఇది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలను సర్దుబాటు చేస్తుంది.
గత కమిషన్ ఏ నిర్ణయం తీసుకుందంటే..
7వ పే కమిషన్ కనీస వేతనాన్ని రూ. 18 వేలుగా నిర్ణయించింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సుమారు 2.57 గా ఉంచింది.
8th Pay Commission Demands | ఎప్పటినుంచి అమలు కావొచ్చంటే..
సాధారణంగా పే కమిషన్లు పదేళ్లకోసారి ఏర్పాటవుతాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు సర్దుబాటు చేస్తుంది. ప్రస్తుతం ఎనిమిదో వేతన కమిషన్ ఏర్పాటయ్యింది. వివిధ సంఘాలు తమ డిమాండ్లను కమిషన్ ముందుంచాయి. అయితే ఇవి ప్రతిపాదనలు మాత్రమే. కమిషన్ వీటిని సమీక్షించి, తన సిఫారసులను సమర్పిస్తుంది. ఆ సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.
గతేడాది నవంబర్ 3న ఏర్పాటైన ఎనిమిదో వేతన కమిషన్ వచ్చే ఏడాది మే వరకు తుది నివేదికను సమర్పించాల్సి ఉంది. కాగా ఏడో వేతన కమిషన్ గడువు గతేడాది డిసెంబర్ 31తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎనిమిదో వేతన కమిషన్ సిఫారసులు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీనుంచే అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేతన కమిషన్‌ను ఆమోదించాక ఏరియర్స్ తో చెల్లించనున్నారు.
ఇది కూడా చదవండి..: Salim Dola Arrest | భారత్కు దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు సలీం డోలా.. టర్కీలో అరెస్ట్


[…] […]