Salim Dola Arrest | భారత్​కు దావూద్​ ఇబ్రహీం సన్నిహితుడు సలీం డోలా.. టర్కీలో అరెస్ట్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Salim Dola Arrest | దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడైన సలీం డోలా (Salim Dola)ను భారతదేశానికి తీసుకువచ్చారు. అతడిని టర్కీలో అరెస్ట్ చేయగా.. ఆ దేశం భారత్​కు అప్పగించింది. దీంతో మంగళవారం ఉదయం ఢిల్లీ (Delhi)లోని ఒక టెక్నికల్ విమానాశ్రయంలో దిగాడు.

అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో నిఘా సంస్థలు సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ తర్వాత ఈ అప్పగింత జరిగింది. ఈ ఉదయం అతడిని ఒక ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడిని అధికారులు విచారిస్తున్నారు. తదుపరి విచారణ కోసం అతడిని ముంబై పోలీసుల (Mumbai Police)కు అప్పగించే అవకాశం ఉంది.

Salim Dola Arrest | డ్రగ్స్​ కింగ్​

దావూద్ మాదకద్రవ్య సామ్రాజ్యం వెనుక సలీం డోలా కీలక వ్యక్తి. అతడి కోసం భారత నిఘా సంస్థలు కొన్ని రోజులుగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల టర్కీ (Turkey)లోని ఇస్తాంబుల్​లో అరెస్ట్ చేశారు. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు కింద వాంటెడ్‌గా ఉన్న డోలాను ఇస్తాంబుల్‌లో జరిగిన ఒక భారీ దాడుల అనంతరం టర్కీ అధికారులు పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 25న అతడిని అరెస్టు చేశారు. ‘మాదకద్రవ్యాల అక్రమ రవాణా’ కేసులో వాంటెడ్‌గా ఉన్న డోలా, బేలిక్‌దుజు జిల్లాలోని ఒక నివాసంలో దాక్కుని ఉండగా గుర్తించారు. అనంతరం అతడిని భారతదేశానికి అప్పగించేందుకు అవసరమైన ప్రక్రియలు పూర్తిచేశారు. ఈ మేరకు తాజాగా అతడిని భారత్ (India)​కు అప్పగించారు.

ఇది కూడా చదవండి..: Food Poisoning Tragedy | విషాదం.. బిర్యానీ, పుచ్చ‌కాయ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *