Food Poisoning Tragedy | విషాదం.. బిర్యానీ, పుచ్చ‌కాయ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Food Poisoning Tragedy | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని (Mumbai) పైధూని ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. అబ్దుల్లా డోకాయా, ఆయన భార్య నస్రీన్ డోకాడియా తమ కుమార్తెలు ఆయిషా, జైనాబ్‌లతో కలిసి నివసిస్తున్నారు.

ఏప్రిల్ 25 రాత్రి వారు బంధువులను ఇంటికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. అందరూ కలిసి బిర్యానీ (Biryani) తిన్నారు. అనంతరం రాత్రి ఒంటి గంట సమయంలో కుటుంబ సభ్యులు పుచ్చకాయ (Watermelon) కూడా తిన్నట్లు సమాచారం. అయితే తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్య కుటుంబంలోని నలుగురికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. క్రమంగా వారి ఆరోగ్యం విషమించింది. అదే భవనంలో నివసించే వైద్యుడు వెంటనే స్పందించి సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఒక కుమార్తెకు సీపీఆర్ (CPR) నిర్వహించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

Food Poisoning Tragedy | ఎలా జరిగింది?

వారిని సమీప ఆసుపత్రికి, తర్వాత మెరుగైన చికిత్స కోసం జేజే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నలుగురూ మరణించారు. ఈ ఘటనపై జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌లో (JJ Marg Police Station) అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం పూర్తి చేసి, ఆహారం మరియు శరీర నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ప్రాథమికంగా ఆహారం విషపూరితం కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతున్నప్పటికీ, ఇతర కారణాల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Food Poisoning Tragedy | కుటుంబం విగ‌త‌జీవులుగా

ఈ ఘటనపై ఏఐఎంఐఎం నేత వారిస్ పఠాన్ స్పందిస్తూ, ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్ప‌టి వ‌ర‌కు సంతోషంగా గ‌డిపిన కుటుంబం ఒకేసారి ఇలా విగ‌త‌జీవులుగా మార‌డం క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

ఇది కూడా చదవండి..: Atal Pension Yojana | అందరికీ పెన్షన్.. ‘అటల్’ యోజనతో సాధ్యం

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *