Delhi powerplay record | ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకున్న ఢిల్లీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప పవర్ ప్లే స్కోర్లు ఇవే..!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi powerplay record | ఐపీఎల్ పోటీల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘోరంగా విఫలమై, అవమానకర రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన బెంగళూరు (Bengaluru) కెప్టెన్ ర‌జ‌త్ ప‌టిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో మ్యాచ్ ప్రారంభం నుంచే ఢిల్లీకి (Delhi) కష్టాలు మొదలయ్యాయి.

ఇన్నింగ్స్ రెండో బంతికే అరంగేట్రం చేసిన సాహిల్ పరాఖ్ ఔట్ కావడంతో ఢిల్లీ షాక్‌కు గురైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌, సమీర్ రిజ్వీలు వరుస బంతుల్లో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో స్కోరు బోర్డు ముందుకు కదలకుండానే వికెట్లు కూలిపోయాయి. స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. బెంగళూరు బౌలర్లు క్రమశిక్షణతో బంతులు వేయడంతో ఢిల్లీ బ్యాటర్లు ఏ మాత్రం ప్రతిఘటన చూపలేకపోయారు.

Delhi powerplay record | ఇంత దారుణ‌మా?

స్టార్ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్‌ (Axar Patel) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. కేవలం 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ, ఆపై నితిష్ రానా రూపంలో మరో వికెట్ కోల్పోయి 13 పరుగులకే 6 వికెట్లతో కుదేలైంది. ఈ దశలో బెంగళూరు బౌలర్లు భువ‌నేశ్వ‌ర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ స్వింగ్, బౌన్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా అదుపులో పెట్టారు.

ఒక్క పరుగు రాబ‌ట్ట‌డానికి చాలా కష్టపడేలా చేసి ఢిల్లీపై పూర్తి ఆధిపత్యం చాటారు. మొదటి ఆరు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి కేవలం 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లేలో నమోదైన అత్యల్ప స్కోరు కావడం విశేషం. గతంలో 2022లో హైదరాబాద్ (Hyderabad) జట్టు చేసిన 14 పరుగుల రికార్డును ఢిల్లీ అధిగమించి ఈ చెత్త రికార్డును నమోదు చేసింది.

ఈ ఘోర ప్రదర్శన ఢిల్లీ క్యాపిటల్స్ ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్లేఆఫ్ Play off అవకాశాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశముంది. మరోవైపు బెంగళూరు బౌలర్ల కట్టుదిట్టమైన వ్యూహాలు, అద్భుత ప్రదర్శన మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపు తిప్పాయి.

Delhi powerplay record

Delhi powerplay record | ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప పవర్ ప్లే స్కోర్లు (6 ఓవర్లు):

13/6 – ఢిల్లీ క్యాపిటల్స్ vs బెంగళూరు, ఢిల్లీ, 2026

14/3 – హైదరాబాద్ vs రాజస్థాన్, పూణే, 2022

14/2 – రాజస్థాన్ vs బెంగళూరు, కేప్ టౌన్, 2009

15/2 – చెన్నై vs కోల్‌కతా, కోల్‌కతా, 2011

16/1 – చెన్నై vs ఢిల్లీ, రాయ్‌పూర్, 2015

కాగా, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ (RCB) ఆరు ఓవ‌ర్ల‌కే ఢిల్లీ ఇచ్చిన ల‌క్ష్యాన్ని చేధించి విజ‌యం అందుకుంది. ఈ మ్యాచ్ ఢిల్లీకి చేదు అనుభవంగా మిగిలిపోగా, బెంగళూరుకి మాత్రం త‌మ బౌలింగ్ శక్తిని చాటిచెప్పే విజయంగా నిలిచింది.

ఇది కూడా చదవండి..: Virat Kohli 9000 IPL Runs : 9 వేల మైలురాయిని దాటిన కింగ్​.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *