IPL 2026 Viral Incident | ఐపీఎల్ 2026లో వైరల్ ఘటన.. నిమ్మకాయతో ‘చేతబడి’ చేసిన ఫ్యాన్, వెంటనే వికెట్!

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2026 Viral Incident | ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఒకవైపు ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీపై ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేయగా, మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai super kings)పై అద్భుతంగా గెలిచింది.

ఈ మ్యాచ్‌లో జరిగిన ఒక విచిత్ర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎస్కే బ్యాటర్ శివమ్ దూబే (Shivam Dube) అవుట్ కావాలని కోరుకుంటూ స్టాండ్స్‌లో ఉన్న ఒక సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) అభిమాని నిమ్మకాయతో ‘చేతబడి’ చేసినట్టు కనిపించాడు. ఈ ఘటన వీడియో రూపంలో వైరల్ అవుతోంది.

IPL 2026 Viral Incident | నిమ్మ‌కాయ మ‌హిమనా?

మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ 59 పరుగులతో చెలరేగగా, హెన్రిచ్ క్లాసెన్ కూడా 59 పరుగులతో జట్టుకు బలాన్నిచ్చాడు.195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఒక దశలో గెలుపు దిశగా కనిపించింది. 16 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, చివరి నాలుగు ఓవర్లలో 46 పరుగులు అవసరమయ్యాయి. అయితే 17వ ఓవర్ ఐదో బంతికి ముందు బౌలర్  బంతి వేయడానికి సిద్ధమవుతుండగా, స్టాండ్స్‌లో ఉన్న ఫ్యాన్ నిమ్మకాయతో ఏవో మంత్రాలు చదువుతున్నట్టు కనిపించాడు. అనంతరం ఆ నిమ్మకాయను గ్రౌండ్ వైపు చూపించాడు.

IPL 2026 Viral Incident | స్ట్రైక్‌లో ఉన్న శివమ్ దూబే ఆ బంతికి బౌల్డ్ కావడం

అదే సమయంలో స్ట్రైక్‌లో ఉన్న శివమ్ దూబే ఆ బంతికి బౌల్డ్ కావడంతో ఈ సంఘటన ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. వెంటనే ఆ అభిమాని ఆనందం వ్యక్తం చేయడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో వైరల్ (Viral Video) అవడంతో నెటిజన్లలో చర్చ మొదలైంది. కొందరు దీన్ని సరదాగా తీసుకుంటుండగా, మరికొందరు ఇది కేవలం యాదృచ్ఛికమేనని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఫ్యాన్ చేసిన చర్య వల్లే వికెట్ పడిందని చెప్పడం సరైంది కాదు. ఇది యాదృచ్ఛిక సంఘటన మాత్రమే. ఈ ఘటనను వినోదాత్మక కోణంలో మాత్రమే చూడాలని సూచిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడమే కాకుండా, ఈ విచిత్ర ఘటనతో కూడా మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది.

ఇది కూడా చదవండి..: Delhi Capitals Win | వాట్ ఏ మ్యాచ్.. మిల్లర్ మాయాజాలం, థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గెలిచిన డీసీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *