అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Sri Lanka Test Squad | శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీని కొనసాగించగా, కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
బీసీసీఐ (BCCI) మంగళవారం ఉదయం జట్టును ప్రకటించింది. భారత్ స్టార్ ఫేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ ఇద్దరు వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ విభాగానికి నాయకత్వం వహించగా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌లు బుమ్రాతో పాటు పేస్ ఎంపికలలో ఉన్నారు.
India Sri Lanka Test Squad | భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదుత్ పడికల్, శరన్ష్ జైన్. సాయి సుదర్శన్, బుమ్రా తుది జట్టులోకి రావడం బీసీసీసై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుంది.
India Sri Lanka Test Squad | శరన్ష్ జైన్..
మధ్యప్రదేశ్ ఆల్-రౌండర్, దేశవాళీ క్రికెట్‌లో ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం తర్వాత 33 ఏళ్ల శరన్ష్ జైన్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. శ్రీలంక పర్యటనలో ఇండియా ‘ఎ’ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో కూడా అతని ఎంపిక జరిగింది. రెండవ అనధికారిక టెస్టులో జైన్ బలమైన ఆల్-రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. శ్రీలంక ‘ఎ’ మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో కూడా అతను అజేయంగా 70 పరుగులు చేయడంతో, ఇండియా ‘ఎ’ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది.
ఇది కూడా చదవండి..: Mirabai Chanu Gold | కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చాను స్వర్ణం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి గోల్డ్