అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asian Games Wushu Silver | ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఐదో రోజు భారత్ రెండు పతకాలను సాధించింది. వుషు మహిళల 60 కేజీల విభాగంలో చైనాకు చెందిన జియావోయు జాంగ్‌తో జరిగిన ఫైనల్‌లో నవోరెమ్ రోషిబినా దేవి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
రోషిబినా దేవి ఆసియా క్రీడలకు అనుకోకుండా ఎంపికైంది. అనంతరం క్రీడల్లో సత్తా చాటి ఏకంగా సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో ఆమె వరుసగా మూడో ఆసియా గేమ్స్ (Asian Games)లో మెడల్ సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. ఆసియా క్రీడలకు ముందు క్రీడాకారిణి దివ్యాన్షి చౌదరి ఆమెపై వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో చివరి నిమిషం వరకు దేవి ఎంపికపై ఉత్కంఠ నెలకొనగా.. జాతీయ సమాఖ్య ఆమెను ఆసియా క్రీడలకు పంపింది. సమాఖ్య నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేవి రజతం గెలుచుకుంది. ఫైనల్‌లో ఆమె 0-2 తేడాతో ఓడిపోయారు. ఆమె 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2022లో రజతం గెలుచుకుంది.
Asian Games Wushu Silver | రోయింగ్‌లో కాంస్యం
రోయింగ్‌లో పురుషుల డబుల్స్ భారత టీమ్ కాంస్యం పతకం సాధించింది. సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో భారత్‌కు ఆరంభంలోనే డబుల్ పోడియం లభించింది. మొదటి 1500 మీటర్ల వరకు రెండో స్థానంలో సాగిన వీరు, చివరి 500 మీటర్ల పోటీలో మూడో స్థానానికి పడిపోయారు. దీంతో కాంస్యంతో సరిపెట్టుకున్నార.ఉ చైనా జోడీ స్వర్ణం, ఉజ్బెకిస్థాన్ ద్వయానికి రజతం దక్కించకున్నాయి. పతకం వస్తుందనుకున్న 10మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల టీం ఈవెంట్లో భారత జట్టు నిరాశ పరిచింది. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
ఇది కూడా చదవండి..: Mirabai Chanu | ఆసియా గేమ్స్‌లో మీరాబాయి చానుకు రజతం