అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad SI Death | హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. నిమజ్జన విధుల్లో ఉన్న ఎస్సైని ఓ బైక్ ఢీకొనడంతో మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సబ్-ఇన్స్పెక్టర్ కె వెంకన్న (55) నిమజ్జన విధుల కోసం హైదరాబాద్‌కు వచ్చారు. విధుల్లో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొంది. అనంతరం ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి ఆపకుండా పరారు అయ్యాడు. కిందపడిపోయిన ఎస్సైని మిగతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతు వెంకన్న చనిపోయారు.
Hyderabad SI Death | నిందితుడి కోసం గాలింపు
కొత్తగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగినప్పుడు ఆయన ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన విధుల్లో ఉన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వైరల్ అవుతోంది. సదరు వాహనదారుడు వేగంగా వచ్చి ఎస్సైని ఢీకొన్నట్లు అందులో ఉంది. అనంతరం ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు.
నిమజ్జనంలో విషాదం.. బైక్ ఢీకొని ఎస్సై వెంకన్న మృతి
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్సై వెంకన్న ట్యాంక్‌బండ్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని బైక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి… pic.twitter.com/lNKGSjoNzM
— Akshara Today | Telugu News (@AksharaToday) September 24, 2026
ఇది కూడా చదవండి..: The Paradise Movie | నానికి పోలీసుల షాక్.. సినిమా చూసేందుకు అనుమతి నిరాకరణ