Meerpet Bus Fire | ట్రావెల్స్​ బస్సులో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో ఓ ట్రావెల్స్​ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Meerpet Bus Fire | హైదరాబాద్‌ (Hyderabad)లోని మీర్‌పేట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సులో మంటలు అంటుకొని కాలిపోయింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

నాగోల్‌లోని శ్రీ మహాలక్ష్మి రియల్ ఎస్టేట్‌కు చెందిన సుమారు 150 మంది 3 బస్సుల్లో శ్రీశైలం బయలుదేరారు. సుమారు 2 గంటల ప్రాంతంలో గాయత్రీ నగర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో పార్క్ చేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుంది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్​ వెంటనే ప్రయాణికులను కిందకు దిగిపోవాలని సూచించాడు. అందరూ సురక్షితంగా కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. అయితే బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

Meerpet Bus Fire | మహారాష్ట్రలో..

మహారాష్ట్రలోని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో అంఆదులో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వారికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అధికారులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇది కూడా చదవండి..: Hyderabad SI Death | హైదరాబాద్​లో విషాదం.. బైక్​ ఢీకొని ఎస్సై మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *