అక్షరటుడే, కామారెడ్డి: BRS Public Apology | అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమైనదని సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్, డీసీసీ జనరల్ సెక్రెటరీ నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం కామారెడ్డి (Kamareddy)లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
BRS Public Apology | వ్యవస్థలను భ్రష్టు పట్టించారు
పదేళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రతిపక్షంలో ఎలా వ్యవహరించాలో కూడా తెలియడం లేదని విమర్శించారు. శాసనసభ దేవాలయం లాంటిదని, అలాంటి సభకు పెద్ద అయిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల బీఆర్ఎస్ నేతలు అమానుషంగా, దురుసుగా మాట్లాడటాన్ని సేవాదళ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు మెహర్ బాబా గౌడ్, కామారెడ్డి టౌన్ అధ్యక్షుడు సుదర్శన్, రాజంపేట మండల అధ్యక్షుడు వేణు చారి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Power Cuts Protest | కరెంటు కోతలకు నిరసనగా రోడ్డెక్కిన కర్షకులు