అక్షరటుడే, లింగంపేట : Power Cuts Protest | కరెంటు కోతలకు నిరసనగా కర్షకులు రోడ్డెక్కారు. బుధవారం లింగంపేట మండల (Lingampeta Mandal) కేంద్రంలోని కేకేవై రహదారిపై అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు.
Power Cuts Protest | ఎండలు మండిపోతుంటే..
ఎండలు మండిపోతున్నాయని రైతులు పేర్కొన్నారు. వర్షాలు లేక పంటలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోరుబావుల ద్వారా నీరు అందించాలని చూస్తే కరెంట్ సక్రమంగా సరఫరా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. కరెంటు ఎప్పుడు ఇస్తారని అడిగితే సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా సబ్ స్టేషన్‌ను తగలబెట్టండని ఉచిత సలహా ఇవ్వడం తో అన్నదాతలు ఆగ్రహానికి గురై బుధవారం లింగంపేట మండల కేంద్రంలోని కేకేవై రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
Power Cuts Protest | 4 గంటలు కూడా రావట్లేదు..
రైతులకు ఉచిత కరెంటు 24 గంటల సరఫరా చేస్తామని ప్రభుత్వం ఒకపక్క గొప్పలు చెబుతుంటే మరోపక్క క్షేత్రస్థాయిలో రైతులకు పంటల సాగుకు 4 గంటలు సైతం ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నుంచి ఐదు గంటలు కరెంటు ఇస్తే పంటలు ఎలా సాగు చేస్తామని నల్లమడుగు రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు కరెంటు ఎప్పుడు ఇస్తారని.. ఎప్పుడు వస్తుంది సార్ అని అడిగితే విద్యుత్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఓ విద్యుత్శాఖాధికారికి ఫోన్ చేస్తే అసహనం వ్యక్తం చేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నేనేం చేయలేను చెప్తున్నట్లు రైతులు వాపోయారు.
నీరు పారడం లేదు
– లక్ష్మణ్, రైతు, నల్లమడుగు
పంటల సాగుకు 4 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. దీంతో వేసిన పొలాలకు నీరు అందక ఎండిపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి.
సబ్‌స్టేషన్ ముట్టడిస్తాం..
– ప్రవీణ్, రైతు, నల్లమడుగు
గత 15 రోజుల నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో పంట పొలాలు ఎండుముఖం పట్టాయి. విద్యుత్ సిబ్బందిని అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ దాటవేస్తున్నారు. రోజుకు 3 నుంచి నాలుగు గంటలకు మించి 3 ఫేజ్ కరెంట్ ఉండటం లేదు. ఇలానే ఉంటే నాలుగైదు రోజుల్లో సబ్ స్టేషన్ ముట్టడిస్తాం.
ఇది కూడా చదవండి..: Rice Mills Strike | జిల్లాలో రైస్‌మిల్లుల బంద్.. కారణమేమిటంటే..?