అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rice Mills Strike | ఉమ్మడి జిల్లాలో రైస్‌మిల్లులు బంద్ నిర్వహిస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొన్నాళ్లుగా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
Rice Mills Strike | ఆ నిబంధన పాటించాలంటే ఎలా..
రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. 1969 నుంచి ఉన్న నిబంధన ప్రకారం క్వింటాల్‌కు 67.1కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉందని.. కాని మారిన పరిస్థితుల కారణంగా దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన చట్టం ప్రకారం బియ్యం సరఫరా సాధ్యం కావట్లేదన్నారు. అలాగే రైతుల తెచ్చిన ధాన్యంలో 15శాతం నుంచి 20శాతం వరకు డ్యామేజీ భరించాల్సి వస్తోందన్నారు.
Rice Mills Strike | పెండింగ్‌లో రూ.4వేల కోట్ల బిల్లులు
అలాగే 2014 నుంచి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లోని అనేక రైస్‌మిల్లులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దీంతో మిల్లుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు ప్రభుత్వం అడుగుతున్న బియ్యం సరఫరా చేయడం కూడా సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయమపై అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించాలని కోరారు. లేనిపక్షంలో బంద్‌కు కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: DCM Truck Accident | కారును తప్పించబోయి డీసీఎం బోల్తా.. జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్