Talasani Srinivas Yadav | సభలో లేనివారిని సస్పెండ్ చేశారు : తలసాని

సభలో లేని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Talasani Srinivas Yadav | అసెంబ్లీ నుంచి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేయడంపై మాజీ మంత్రి, సనత్​నగర్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో లేనివారిని సైతం సస్పెండ్​ చేశారని విమర్శించారు.

అసెంబ్లీ లాబీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ చిట్​చాట్​లో మాట్లాడారు. శాసన సభను అభాసుపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటి గురించి చర్చించకుండా డైవర్షన్​ చేస్తున్నారన్నారు. మొదటి రోజు అసెంబ్లీ గేటు బయట, రెండో రోజు కేసీఆర్ (KCR) వ్యవసాయ క్షేత్రం వద్ద డ్రామా నడిపించారని విమర్శించారు.

Talasani Srinivas Yadav | కేసీఆర్​ చావు కోరుకుంటున్నారు..

కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కేసీఆర్​ చావు కోరుకుంటున్నారని తలసాని అన్నారు. కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యేను సస్పెండ్ చెయ్యలేదని, కానీ తిరుపతిలో ఉన్న మల్లారెడ్డిని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. సభలో లేని కేటీఆర్​, గూడెం మహిపాల్ రెడ్డిని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. 22- A అంశం జీవో 97 చర్చకు వస్తాయిని ప్రభుత్వం భయపడుతుందని, అందుకే తమను సస్పెండ్ చేసిందన్నారు. దళిత స్పీకర్ అంటూ స్పీకర్​ను కాంగ్రెస్ అవమానిస్తుందని పేర్కొన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే బీఆర్ఎస్​కు గౌరవం ఉందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Sabitha Indra Reddy | మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేదు : సబితా ఇంద్రారెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *