PCC Chief Comments | ‘మీడియా’ కథనాలపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief Comments | పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ కు వ్యతిరేకంగా ఇటీవల ఓ ఛానెల్​ వార్తలు ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన పని తీరు సరిగ్గా లేదని కాంగ్రెస్​ అనుకూలంగా వ్యవహరించే సదరు ఛానెల్​ వార్తలు ప్రసారం చేయడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో తనపై వచ్చిన కథనాలపై మహేశ్​కుమార్​ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు.

గాంధీ భవన్​ (Gandhi Bhavan)లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ శనివారం మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. గాంధీ భవన్ ట్రస్ట్ కింద నడుస్తుందని తెలిపారు. వెనుక ప్రాపర్టీలో ఏమైనా జరిగితే అది కూడా మాకు ఆపాదిస్తే ఎలా అని ప్రశ్నించారు. పత్రిక స్వేచ్ఛను కూడా తాను నమ్ముతానని అన్నారు. అయితే తన పనితీరును బేరీజు వేయాల్సింది కార్యకర్తలు, ఏఐసీసీ నాయకులు అని స్పష్టం చేశారు. ఒక చానల్ వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పినంత మాత్రానా తాను భయపడనని పేర్కొన్నారు. చిన్న చితకా విషయాలు పట్టించుకోనన్నారు.

PCC Chief Comments | ఏఐసీసీ నిర్ణయాన్ని పాటిస్తా

టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మార్పు అనేది ఏఐసీసీ నిర్ణయమని మహేశ్​గౌడ్ తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తప్పకుండా పాటిస్తానని చెప్పారు. తన మీద నమ్మకంతో పార్టీ పెద్దలు ఈ అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. తాను, సీఎం కలిసి కట్టుగా పని చేస్తున్నామని తెలిపారు. తనపై గిట్టని వారు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్నారు.

PCC Chief Comments | సమన్వయంతో ఉండండి

తనపై వార్త కథనాల ప్రసారం నేపథ్యంలో సమన్వయంతో ఉండాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ప్రజాస్వామ్య విలువలతో కూడిన పార్టీ కాంగ్రెస్  అని తెలిపారు. మీడియా కథనాలు మన పనితీరును కుంగతీయలేవు అన్నారు. ఒక న్యూస్ ఛానెల్​లో తనపై, కాంగ్రెస్ పార్టీ (Congress Party) పైన ఒక కల్పిత కథనం రోజంతా ప్రసారం చేశారని పేర్కొన్నారు. అభూత కల్పనలతో, అసత్యాలతో వ్యక్తిగగతంగా అప్రతిష్టపాలు చేసే విధంగా కథనాలు ప్రసారం అయ్యాయని తెలిపారు. ఆ మీడియాలో ఏదో ప్రసారం చేసినంత మాత్రాన మనం హర్ట్ కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కార్యకర్తలు ఆవేశానికి గురి కాకుండా ఓపికగా, ప్రశాంతంగా, సమన్వయంతో ఉండాలని కోరారు.

PCC Chief Comments | బీఆర్​ఎస్​ వచ్చేది లేదు

ఫ్యూచర్‌ సిటీని హరీష్‌రావు (Harish Rao) రద్దు చేస్తామంటున్నారని మహేశ్​ గౌడ్​ అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ వచ్చేది లేదు.. రద్దు చేసేది లేదని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్‌ సిటీ రాష్ట్రానికి తలమానికం అని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ సమస్యతో హైదరాబాద్‌లో నరకం కనిపిస్తోందన్నారు. అందుకే అన్ని హంగులతో ఫ్యూచర్‌ సిటీ ప్లాన్‌ చేశామని తెలిపారు.

PCC Chief Comments | అందుకే బీజేపీ గెలిచింది

బెంగాల్​లో బీజేపీ గెలుపుపై మహేశ్​ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్‌లో 93 లక్షల ఓట్లు తొలగించారని, 31 లక్షల ఓట్లు చేర్చారన్నారు. ప్రభుత్వం మారింది 31 లక్షల ఓట్లతోనే అన్నారు. తెలంగాణలో ఓటు హక్కు కాలరాసే ప్రయత్నం అడ్డుకుంటామని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కేటీఆర్‌ దగ్గర ఉన్న లెక్కలు తప్పు అని చెప్పారు. ఈ సారి దిగుబడి పెరిగిందని, కొనుగోలులో కొంత ఆలస్యం జరిగిందన్నారు. తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వచ్చి అరకొర నిధులు ఇచ్చి వెళ్లారన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పీసీసీకి సంబంధం లేదని మహేశ్​ గౌడ్​ తెలిపారు.

ఇది కూడా చదవండి..: POLYCET Results | పాలిసెట్​ ఫలితాలు విడుదల 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *