Nizamabad Urban Funds | ‘అర్బన్’కు నిధులివ్వని కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే ధన్​పాల్​

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Urban Funds | అర్బన్ అభివృద్ధికి (Nizamabad Urban) నిధులు తీసుకురాలేని కాంగ్రెస్​ ప్రతినిధులు రాజీనామా చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) డిమాండ్​ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Nizamabad Urban Funds | రెండున్నరేళ్లుగా ఒక్క రూపాయి..

ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయినా ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. జిల్లాపై కాంగ్రెస్​ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెడుతూ ముందుకు సాగుతోందన్నారు. వైఎస్ఆర్(YSR), డీఎస్ మాదిరిగా.. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumaar Goud) జోడీ లక్కీ అంటున్నారు కానీ..కేవలం వారి జేబులు నింపుకోవడానికే జోడీ కలిసిందన్నారు. అర్బన్ విషయంలో అనేక సార్లు మంత్రులను, అధికారులను కలిసి వినతులు అందించినా..లాభం లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వ పెద్దలు జిల్లాలో అనేక మంది ఉన్నా.. నిధులు తేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

Nizamabad Urban Funds | నిజామాబాద్​ ఓఆర్​ఆర్​పై చిన్నచూపేలా..?

ఖమ్మం, కరీంనగర్, వరంగల్​కు (Warangal) ఓఆర్ఆర్ (ORR) మంజూరు చేశారు కానీ నిజామాబాద్​పై చిన్నచూపు ఎందుకని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి ఓఆర్ఆర్ తీసుకొస్తానంటూ ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్​దేనని… పీసీసీ ప్రెసిడెంట్ జిల్లా వాసి అని.. ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు, ఛైర్మన్లు జిల్లా నుంచే ఉన్నారన్నారు. రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్​కు చెందిన వ్యక్తే అయినా.. నగరానికి రింగ్​రోడ్డు తేలేకపోయారని విమర్శించారు. సీఎం వైఎస్సార్​ హయాంలోనే జిల్లాకు 52 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ప్రణాళిక సిద్ధమైందన్నారు. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదన్నారు. కేవలం 11కి.మీ బైపాస్ రోడ్డును 12 ఏళ్లుగా పూర్తి చేయకుండా నత్తనడకన నడిపిస్తున్నారని విమర్శించారు. అలాగే ఖమ్మం, వరంగల్, కరీంనగర్​కు ఆయా అభివృద్ధి పనుల కోసం రూ.5,620 కోట్లు నిధులు వచ్చాయన్నారు. ఈ క్రమంలో నిజామాబాద్​ను మాత్రం విస్మరించారన్నారు.

Nizamabad Urban Funds | మాస్టర్​ ప్లాన్​ అటకెక్కింది

నిజామాబాద్ అర్బన్​లో 30 ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ అటకెక్కిందని, స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. కళాభారతి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్​లు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవడంతో నిలిచిపోయాయని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు నిండుగా వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే బీజేపీ పోరాటం ఉధృతం చేస్తుందన్నారు. వచ్చే వారంలో సీఎంని కలుస్తానని, స్పందించకపోతే తమ సత్తా చాటుతామన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు న్యాలం సునీత రాజు, మఠం పవన్, చింతకాయల రాజేందర్, కల్పె చిరంజీవి, జగదీష్ కులకర్ణి, పసునూరి రాము మండల అధ్యక్షుడు ఇప్పకాయల కిషోర్, భూపతి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Odisha Fire Accident | జలవిద్యుత్​ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *