Odisha Fire Accident | జలవిద్యుత్​ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Odisha Fire Accident | ఒడిశా (Odisha)లోని మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. పవర్‌ స్టేషన్‌ షట్‌డౌన్‌ అయిన అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

విద్యుత్​ కేంద్రం (Power Station)లో మంటలు అంటుకున్న సమయంలో పలువురు కార్మికులు రెండో అంతస్తులో చిక్కుకుపోయారు. దట్టంగా పొగలు వ్యాపించడం, మంటలు ఎగిసి పడుతుండటంతో లోపలికి ఎవరు వెళ్లలేకపోతున్నారు. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Odisha Fire Accident | కొండల మధ్యలో..

ఈ విద్యుత్​ కేంద్రం కొండల మధ్య ఉంది. దీంతో అగన్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అయితే లోపల ఎంతమంది కార్మికులు చిక్కారో ఇంకా స్పష్టత రాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ విద్యుత్​ కేంద్రాన్ని ఆంధ్ర ప్రదేశ్​, ఒడిశా ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Varanasi Incident | కాశీలో గంగాస్నానం చేస్తూ బీరు​ తాగిన వ్యక్తి.. కేసు నమోదు

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *