Infant Abandonment Case | కామారెడ్డిలో అమానవీయ ఘటన.. ఇసుక కుప్పలో పసికందు మృతదేహం

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Infant Abandonment Case | కామారెడ్డి (Kamareddy)లో మానవత్వం మంటకలిసింది.. ఇసుక కుప్పలో పసికందు మృతదేహాన్ని చూసిన వారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పట్టణంలోని ముషీరాబాగ్ ప్రాంతంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

Infant Abandonment Case | రెండురోజుల వయస్సున్న పసికందు..

పట్టణంలోని ముషీరాబాగ్​ ప్రాంతంలోని ఇసుక కుప్పలో రెండు రోజుల వయసున్న పసికందు విగతజీవిగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. శనివారం ఉదయం ఆ దారిన వెళ్తున్న వారు ఇసుక కుప్పలో పసికందు మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న కామారెడ్డి పట్టణ పోలీసులు (Kamareddy Police) మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఎవరు వదిలేసి వెళ్లారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Infant Abandonment Case | పోషించలేక వదిలేశారా..?

బిడ్డను పోషించలేక వదిలేశారా..? లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని, చుట్టుపక్కల సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. ఆస్పత్రుల్లో ఇటీవల జరిగిన ప్రసవాల వివరాలను కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Blood Cancer Tragedy | తండ్రిని బలిగొన్న బ్లడ్​ క్యానర్స్​.. పసికందును ముద్దాడకుండానే కన్నుమూసిన వైనం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *