జాతీయంVaranasi Incident | కాశీలో గంగాస్నానం చేస్తూ బీరు​ తాగిన వ్యక్తి.. కేసు నమోదు

Varanasi Incident | కాశీలో గంగాస్నానం చేస్తూ బీరు​ తాగిన వ్యక్తి.. కేసు నమోదు

కాశీలో గంగాస్నానం చేస్తూ ఓ వ్యక్తి బీరు తాగాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varanasi Incident | భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కాశీ (Kashi)లో ఓ వ్యక్తి గంగాస్నానం చేస్తూ బీరు​ తాగాడు. ఈ వీడియో సోషల్​ మీడియా (Social Media)లో వైరల్ కాగా.. భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్​ చేశారు.

వైరల్ అయిన వీడియోలో ఆ వ్యక్తి నదిలో స్నానం చేస్తూ బీరు తాగుతున్నట్లు కనిపిస్తోంది. నిందితుడిని బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లా నివాసిగా గుర్తించామని అధికారులు తెలిపారు. ఏసీపీ దశాశ్వమేధ అతుల్ అంజన్ త్రిపాఠి మాట్లాడుతూ, వైరల్ అయిన వీడియోను పోలీసులు సుమోటోగా స్వీకరించి, అందులో ఉన్న వ్యక్తిని గుర్తించారని చెప్పారు.

Varanasi Incident | నిందితుడి అరెస్ట్

బీహార్‌ (Bihar)లోని రోహ్‌తాస్​కు చెందిన నిందితుడిని పట్టుకోవడానిక వారణాసి పోలీసులు వెళ్లారు. అక్కడ నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకు వస్తున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహిస్తారని, భక్తులు, సందర్శకులు మత మనోభావాలను దెబ్బతీసే లేదా చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు పాల్పడవద్దని ఏసీపీ విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..: Petrol Diesel Price Hike | ముచ్చటగా మూడోసారి వడ్డన.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bajaj Pulsar N160 | బజాజ్ పల్సర్ కొత్త వేరియంట్ లాంచ్ ..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bajaj Pulsar N160 | భారతదేశ టూ వీలర్...

Hyderabad Lawyer Murder | హైదరాబాద్​లో న్యాయవాది హత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Lawyer Murder | హైదరాబాద్​లో ఓ న్యాయవాది...

POLYCET Results | పాలిసెట్​ ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: POLYCET Results | తెలంగాణ పాలిసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి....

Congress SC Cell | కాంగ్రెస్​ ఎస్సీ సెల్​ రాష్ట్ర కమిటీ నియామకం..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Congress SC Cell | కాంగ్రెస్ పార్టీ ​...