అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rebel TMC MPs | పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తాము దాఖలు చేసినపిటిషన్లపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ పార్టీ నాయకుడు అభిషేక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన 20 మంది రెబెల్ లోక్‌సభ ఎంపీలకు సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం నోటీసులు జారీ చేసింది.
Rebel TMC MPs | పార్టీ మారినట్లు ఆరోపణలు
20 మంది టీఎంసీ ఎంపీలు పార్టీ మారారని ఆరోపణలు రావడంతో, వారి అనర్హతను కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, ఈ అనర్హత పిటిషన్లపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీ ఫిరాయింపుల కారణంగా రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కింద, రెబెల్ ఎంపీలపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ బెనర్జీ సుప్రీంను ఆశ్రయించారు.
Rebel TMC MPs | రెబెల్ ఎంపీలతో పాటు పార్టీలకు నోటీసులు
విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టు 20 మంది రెబెల్ ఎంపీలతో సహా, ఈ కేసులో సంబంధం ఉన్న ఇతర పార్టీలకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ దశలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు జారీ చేయలేదు. స్పీకర్ నుంచి ఆదేశాలు తీసుకుని.. ఆ విషయాన్ని కోర్టుకు తెలియజేస్తానని.. స్పీకర్‌కు తక్షణమే నోటీసు జారీ చేయవద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం స్పీకర్‌కు నోటీసు జారీ చేసే విషయంపై డిసిషన్ తీసుకునే ముందు తదుపరి వాదనల కోసం వేచి ఉండాలని నిర్ణయించింది.
ఇది కూడా చదవండి..: Nasha Mukt Bharat | ‘నషా ముక్త్ భారత్’ కోసం యువత కృషి చేయాలి: గవర్నర్ శివ్ ప్రతాష్ శుక్లా