అక్షరటుడే వెబ్‌డెస్క్: Jairam Ramesh Criticism | ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. మోదీ సాధించిన రికార్డులు దేశానికి మేలు చేయకపోగా, సమస్యలుగా మారాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ( Jairam Ramesh )ఆరోపించారు. ఆయన పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని ఆయన మండిపడ్డారు.
Jairam Ramesh Criticism | జైరాం రమేశ్ విమర్శలు..
1947లో నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడిన తొలి మంత్రివర్గం, కేవలం ఐదేళ్లలోనే ఆధునిక భారతావనికి పునాదులు వేసిందని రమేశ్ గుర్తు చేశారు. రాచరిక రాష్ట్రాల విలీనం, రాజ్యాంగ రచన, జమీందారీ వ్యవస్థ రద్దు , నీటిపారుదల ప్రాజెక్టులతో దేశాన్ని ప్రపంచ శక్తిగా తీర్చిదిద్దారని ఆయన వివరించారు. నెహ్రూ కాలం నాటి గొప్ప చరిత్రను చెరిపేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Jairam Ramesh Criticism | మెజారిటీపై ఎద్దేవా..
1952, 1957, 1962 ఎన్నికల్లో నెహ్రూ భారీ మెజారిటీతో విజయం సాధించారని, కానీ 2024 ఎన్నికల్లో మోదీకి కనీస మెజారిటీ కూడా రాలేదని రమేశ్ ఎద్దేవా చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో మద్దతు కోసం మిత్రపక్షాలకు ఎర వేయాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు.
Jairam Ramesh Criticism | ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి..
పేపర్ లీకేజీ కుంభకోణాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను బలహీనపరుస్తున్నారని జైరాం రమేశ్ తీవ్రంగా విమర్శించారు.
ఇది కూడా చదవండి: Steel Plant Accident | విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో 9కి చేరిన మృతులు..
