Meenakshi Natarajan Nomination | మీనాక్షి నటరాజన్​ కేసు వివరాలు బయట పెట్టింది ఎవరు : బీఎల్​ సంతోష్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Meenakshi Natarajan Nomination | రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్​ నామినేషన్​ను ఈసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్​ నాయకులు ఆందోళన చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP government)పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోష్​ సంచలన ట్వీట్ చేశారు.

అంతటా గట్టిగా అరుస్తున్న @INCIndia బృందం, మీడియాలోని వారి అనుకూల వాదులు… ఆ పార్టీకి చెందిన వారిలో ఎవరు తెలంగాణ అంశాన్ని బహిరంగ చర్చలోకి తెచ్చారన్న ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారని బీఎల్ సంతోష్ అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితులను నివారించడానికి ఆ లోపాన్ని సరిదిద్దుకోవడం మంచిదని ఆయన కాంగ్రెస్​కు సూచించారు.

Meenakshi Natarajan Nomination | ఎవరు బయట పెట్టారు

తెలంగాణలో మీనాక్షి నటరాజన్​ (Meenakshi Natarajan)పై కేసు నమోదు అయింది. ఈ విషయాన్ని ఆమె రాజ్యసభ నామినేషన్​ అఫిడవిట్​లో పేర్కొనలేదు. దీంతో బీజేపీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. కేసు వివరాలు దాచిపెట్టారని ఆరోపించారు. దీంతో రిటర్నింగ్​ అధికారి ఆమె నామినేషన్​ను తిరస్కరించారు. అయితే ఎన్నికల వేళ ఆమెపై నమోదు అయిన కేసు వివరాలు ఎవరు బయట పెట్టారని చర్చ సాగుతోంది. కాంగ్రెస్​కు చెందిన నాయకులే ఇలా చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు.

Meenakshi Natarajan Nomination | సైబర్​ క్రైంలో ఫిర్యాదు

Meenakshi Natarajan Nomination

మీనాక్షి నటరాజన్​ కేసు వివరాలను సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) బయట పెట్టారని సోషల్​ మీడియాలో కొందరు వ్యాప్తి చేస్తున్నారు. ఓ ఛానెల్​లో ఈ వార్త ప్రచురితం కాగా కాంగ్రెస్​ నాయకులు స్పందించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు సైబర్​ క్రైం పోలీసు (Cyber ​​Crime Police)లకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రతిష్ట, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఓ ఛానెల్ వ్యవహరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Kavitha Law and Order | రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది: కవిత

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *