Kavitha Singareni Visit | 15 నుంచి సింగరేణిలో పర్యటించనున్న కవిత

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha Singareni Visit | తెలంగాణ రాజకీయాలు సింగరేణి చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల హరీశ్​రావు (Harish Rao) సింగరేణిలో పర్యటించగా.. కేటీఆర్​ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

సింగరేణిలో భారీగా అవినీతి జరుగుతోందని బీఆర్​ఎస్​ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత సైతం సింగరేణిలో పర్యటించనున్నారు.కవిత ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో ‘‘బాయిబాట’’ పేరుతో పర్యటిస్తారు. సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద సింగరేణి కార్మికులతో సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఆరు రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారు.

Kavitha Singareni Visit | ఐదు నియోజకవర్గాల్లో..

టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) ఈ నెల 15న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి ఏరియాలో పర్యటిస్తారు. 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్, 17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ – 1 ఏరియా, 18న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ – 2 ఏరియాలో, 19న మంథని నియోజకవర్గంలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఆర్ జీ – 3 ఏరియా, 20న భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి ఏరియా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద కార్మికులతో సమావేశమవుతారు.

Kavitha Singareni Visit | సమస్యల పరిష్కారం కోసం..

Kavitha Singareni Visit

సింగరేణి కార్మికుల కోసం కవిత పోరుబాట పడుతున్నారు. ఆమె గతంలో సైతం ఈ ప్రాంతంలో పర్యటించారు. కవిత బీఆర్​ఎస్​ హయాంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) కి గౌరవ అధ్యక్షురాలిగా పని చేశారు. కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత సైతం సింగరేణి కార్మికుల సమస్యలను లేవనెత్తారు. ఈ క్రమంలో తాజాగా ఆమె సింగరేణిలోని పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. కార్మికుల సమస్యలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.

ఇది కూడా చదవండి..: Meenakshi Natarajan Nomination | మీనాక్షి నటరాజన్​ కేసు వివరాలు బయట పెట్టింది ఎవరు : బీఎల్​ సంతోష్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *