Dharmapuri Temple | ధర్మపురి ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమిపూజ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dharmapuri Temple | జగిత్యాల జిల్లా (Jagtial District)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులకు సోమవారం తెల్లవారుజామున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమిపూజ చేశారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వేములవాడలో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. తాజాగా ధర్మపురి క్షేత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్​తో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు.

Dharmapuri Temple | రూ.200 కోట్లతో..

ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం గతంలో రూ.117 కేటాయించింది. అదనంగా మరో రూ. 80 కోట్లు వెచ్చించి, మొత్తం రూ. 200 కోట్ల వ్యయంతో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం రూ. 22.16 కోట్లతో నూతన ఘాట్ల నిర్మాణం, తిమ్మపూర్‌లో రూ. 2.48 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ధర్మపురి క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: BJP MLAs Protest | అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *