Jagadish Reddy Counter | సీఎంకు మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి కౌంటర్​

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. సంస్కారం, సబ్జెక్ట్​ లేనివాళ్లే ఎత్తు గురించి మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jagadish Reddy Counter | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. సంస్కారం, సబ్జెక్ట్​ లేనివాళ్లే ఎత్తు గురించి మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం నల్గొండ సభలో జగదీశ్​రెడ్డిపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తులసి వనంలో గంజాయి మొక్కలాగా సూర్యాపేటలో ఒక జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు.. వచ్చే ఎన్నికల్లో ఆయనను కూడా గెలవనియ్యం అని కొందరు యువకులు తనతో అన్నట్లు సీఎం సభలో చెప్పారు. ఆయన వ్యాఖ్యలకు తాజాగా జగదీశ్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. మనుషుల ఎత్తులు, పొడుగుల గురించి.. సబ్జెక్ట్ లేనివాడు, సంస్కారం లేని వాడు మాత్రమే మాట్లాడుతారని విమర్శించారు.

Jagadish Reddy Counter | కేసీఆర్​ రావాలంటున్నారు

గులాబీ కార్యకర్తలకు మూడు నిమిషాల సమయం ఇస్తే.. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ చేసిన 3,000 అభివృద్ధి పనులేంటో లెక్కలతో సహా చెప్తారని మాజీ మంత్రి అన్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ముప్పై రోజులు సమయమిచ్చినా… మీరు చేసిన ఒక్క అభివృద్ధి పనిని కూడా చూపించలేరు, చెప్పలేరని విమర్శించారు. కేటీఆర్ పర్యటనలో ప్రజలు, మహిళలు మళ్లీ మీరే రావాలని ఆదరిస్తున్నారన్నారు. అదే రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలే అసభ్యంగా తిట్టుకుంటూ వెళ్లారని, సొంత ఎమ్మెల్యేలు సభకు రాలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ముట్టుకోవడం రేవంత్ రెడ్డి తరం కాదన్నారు.

Jagadish Reddy Counter | సీఎం క్షమాపణ చెప్పాలి

 Jagadish Reddy Counter

సీఎం రేవంత్​రెడ్డి నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగదీశ్​రెడ్డి అన్నారు. ఆయన జిల్లాకు ఎంతో ద్రోహం చేశారన్నారు. కేసీఆర్​ గురించి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అభివృద్ధి విషయంలో కేసీఆర్​ దేశానికి ఆదర్శం అన్నారు. ప్రజలు కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. శాసన సభలో బీఆర్​ఎస్​ను ఎదుర్కొనే దమ్ము ఉందా అని సీఎంకు ఆయన సవాల్ విసిరారు. రేవంత్​రెడ్డి మాట్లాడిన దానిలో తమకు సగం సమయం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వంలో స్కీమ్​లు లేవని, స్కామ్​లు మాత్రమే ఉన్నాయని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: RTC Bus Accident | బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *