Bigala Ganesh Gupta Accident | మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​గుప్తాకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును కంటైనర్​ ఢీకొట్టింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​ : Bigala Ganesh Gupta Accident | మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​గుప్తా (Bigala Ganesh Gupta)కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును కంటైనర్​ ఢీకొట్టింది. భిక్కనూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Bigala Ganesh Gupta Accident | జాతీయ రహదారిపై..

జాతీయ రహదారిపై భిక్కనూరు (Bhikkanoor) వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి కంటైనర్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు మాజీ ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రహదారిపై భారీగా ట్రాఫిక్​ స్తంభించింది. సమాచారం అందుకున్న భిక్కనూరు పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్​ క్లియర్​ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Munnuru Kapu Merit Awards | మున్నూరు కాపు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *