Putin on India | భారత్ ఎన్నడూ విదేశాల ఆదేశాలను పాటించదు: పుతిన్

న్యూఢిల్లీ ఎన్నడూ విదేశీ శక్తుల 'ఆదేశాలను' పాటించదని, సార్వభౌమ దేశంగానే వ్యవహరిస్తుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Putin on India | న్యూఢిల్లీ (New Delhi) ఎన్నడూ విదేశీ శక్తుల ‘ఆదేశాలను’ పాటించదని, సార్వభౌమ దేశంగానే వ్యవహరిస్తుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యాతో సహకారాన్ని తగ్గించుకోవాలని భారత్‌పై నిరంతరం ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)కు ఆయన కౌంటర్​ ఇచ్చారు.

Putin on India | భారత్​పై ఆంక్షలు విధిస్తే వారికే ఎదురుదెబ్బ

సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక (SPIEF)లో పుతిన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ట్రంప్ భారత్‌పై విధించిన ఆంక్షలు తిరిగి వారికే ఎదురుదెబ్బ తగులుతాయన్నారు. “జాతీయ ప్రయోజనాలు, ధర, సాంకేతిక ఆధిక్యత” ఆధారంగానే భారత్ తన భాగస్వాములను ఎంచుకుంటుందని చెప్పారు.

“రష్యా (Russia)తో సహకారంలోని కొన్ని అంశాలతో సహా పలు విషయాలపై అమెరికా భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పటికైనా అందరికీ ఒక విషయం స్పష్టమై ఉండాలి. 150 కోట్ల జనాభా గల దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తేవడం వ్యర్థమైన ప్రయత్నం” అని పుతిన్ పేర్కొన్నారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Putin on India | రష్యాకు భారత్ నమ్మకమైన భాగస్వామి

Putin on India

రష్యాకు భారత్ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని, మాస్కోను ఏకాకిని చేయడానికి పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయని పుతిన్ అన్నారు. భారత్-రష్యా మధ్య సైనిక సహకారం సోవియట్ కాలం నాటిదని, భవిష్యత్తులో ఈ సంబంధాలు మరింత పెరుగుతాయన్నారు. “భారత్‌తో రష్యా రక్షణ సహకారం ఏ మూడవ దేశం నుంచీ వచ్చే రాజకీయ ఒత్తిడి వల్ల ప్రభావితం కాదు.” అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Delhi Jantar Mantar Protest | ఢిల్లీలో హై టెన్షన్.. జంతర్​ మంతర్​ వద్ద భారీ భద్రత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *